పెళ్లైన ఏడాదికే విడిపోయిన స్టార్ సెలబ్రిటీ కపుల్, అసలు వీరికి ఏమైంది..!
గత ఐదేళ్లుగా వీరిద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తాజాగా ఈ లవ్ బర్డ్స్ విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ విషయంపై ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ అధికారికంగా వెల్లడించలేదు. అయితే వీరిద్దరికీ బ్రేకప్ అయినా సరే.. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే బాలీవడు కపుల్ దిల్జీత్ కౌర్- నిఖిల్ పటేల్ గురించే. వీళ్లిద్దరు విడిపోయారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ, వాటిని కేవలం పుకార్లు అనే అంతా అనుకున్నారు. పైగా కెన్యా నుంచి దిల్జీత్ కౌర్ ఇండియాకి తిరిగిరాగానే ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఈ విడాకుల వార్తలను స్వయంగా నిఖిల్ పటేల్ అంగీకరించాడు. విడాకుల వార్తలు నిజమే అంటూ స్పష్టం చేశాడు. దిల్జీత్ కౌర్ ఇండియా వచ్చినప్పుడే అంతా అయిపోయినట్లు క్లారిటీ ఇచ్చేశాడు. వాళ్లిద్దరు నిజంగానే విడిపోతున్నట్లు వెల్లడించాడు. నిఖిల్ పటేల్ మాట్లాడుతూ.. “మా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. నిజానికి మా మధ్య పెళ్లి అనే పునాది అంత బలంగా పడలేదు. మా పెళ్లి 2023లో అధికారికంగా జరిగినా.. ఇంకా రిజిస్టర్ కాలేదు. మా ఇద్దరి మధ్య చాలానే భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.
దిల్జీత్ కౌర్ కెన్యా రావడంతో ఇండియాని మిస్ అవ్వడమే కాదు.. తన కెరీర్ ని కూడా కోల్పోయింది. ఆమెకు కెన్యా వాతావరణం అసలు నచ్చలేదు. మా కొడుకు స్కూల్ కి వెళ్లాలి అనుకున్నప్పుడు ఆమెకు తిరిగి కెన్యా వెళ్లే ఆలోచన లేదు అని నాకు అర్థమైంది. మా మధ్య బంధం కూడా అప్పుడే ముగిసిపోయింది అనుకున్నాను. దిల్జీత్ కౌర్ కు మంచి జరగాలని కోరుకుంటున్నాను. దిల్జీత్ ఇండియాకి తిరిగి వెళ్లిపోయినప్పుడే మా బంధం ముగిసిపోయినట్లు అయ్యింది.
మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా కూడా.. మంచి స్నేహితులుగా మాత్రం కలిసే ఉంటాం” అంటూ నిఖిల్ పటేల్ వెల్లడించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరి విడాకుల వార్త నెట్టింట వైరల్ గా మారింది.ఇప్పటివరకు వచ్చిన వార్తలు పుకార్లు కాదు. నిజమే అని క్లారిటీ వచ్చేసింది. పైగా వారి మధ్య విభేదాలు ఉన్న విషాన్ని నిఖిల్ స్వయంగా అంగీకరించడంతో రావాల్సిన స్పష్టత వచ్చేసింది. మరి.. బాలీవుడ్ కపుల్ పెళ్లైన ఏడాదికే విడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.