News

తల్లికాబోతున్న కృతి శెట్టి, దిమ్మతిరిగే సీక్రెట్ రివీల్ చేసిన బ్యూటీ.

వరుస ఫ్లాప్ మూవీస్ తర్వాత కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తున్న సినిమా మనమే. ఇందులో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. డైనమిక్ హీరో శర్వానంద్ కెరీర్‌లో 35వ మూవీగా వస్తోంది ఈ మనమే. అయితే తన తొలి సినిమా ఉప్పెనతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది కృతి శెట్టి. అమ్మడి చురకత్తుల్లాంటి చూపులకు యువత పడిపోయింది. వెండితెరపై తన మార్క్ చూపించి అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తల్లి కాబోతోందట.

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న మనమే అనే సినిమాలో నటిస్తోంది కృతి శెట్టి. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కృతి శెట్టిది మదర్ క్యారెక్టర్ అనే సమాచారం బయటకొచ్చింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో రూపొందిస్తున్నారు. జూన్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సుభద్రగా అలరించనుందట కృతి.

సుబ్రద క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త. ఇప్పటివరకు క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది అని చెప్పి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొల్పింది కృతి. ఈ సినిమాలో అమ్మడి రోల్ చాలా కొత్తగా ఉంటుందట. ఉప్పెన తర్వాత నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’, నాగ చైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది కృతి శెట్టి.

తన ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది కృతి శెట్టి. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. దీంతో ఆన్ లైన్ మాధ్యమాలపై కృతి హంగామా నడుస్తోంది. గ్లామర్ పరంగా యువతకి కిక్కిచ్చిన ఈ బ్యూటీకి ఆశించిన మేర అవకాశాలు అయితే రావడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే డిఫరెంట్ రోల్స్‌కి ఓకే చేస్తూ మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని ప్లాన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker