News

నేను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలనుకున్నాను అంటూ సంచలన విషయాలు చెప్పిన స్టార్ యాంకర్.

రీతూ చౌదరి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన రీతూ.. ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ షోస్ చేస్తూ ఫోటోస్ షేర్ చేస్తుంది. నెట్టింట చాలా యాక్టింగ్‏గా రీల్స్ షేర్ చేస్తుంటుంది. కొన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తూ రియాల్టీ షోస్, సినిమాలకు దూరంగా ఉంటున్న రీతూ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అయితే బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో.. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి..

చివరికి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన సినీ నటి హేమ గురించి తెలియనిది కాదు. ఈ పార్టీకి హాజరైన వారందరికీ టెస్ట్స్ నిర్వహించడంతో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు పోలీసులు. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రీతూ కూడా ఈ రేవ్ పార్టీ గురించి చర్చిండడంతో.. అందరికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. రీతూ రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. “నేను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలని అనుకున్నాను. రేవ్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను.

అక్కడ ఏం చేస్తారో కూడా తెలియకపోవడం వలన ఓసారి వెళ్తే బావుంటుందని అనుకున్నాను. కానీ, ఇటీవల జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను విన్న తర్వాత.. ఇలా ఉంటుందా అని షాక్ అయ్యాను. ఇలాంటి పార్టీలకు అయితే నేను చాలా దూరం. తెలియక ముందు వెళ్లాలని అనిపించింది కానీ అదేంటో తెలిసిన తర్వాత.. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అర్ధం అయింది” అంటూ రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. దీనితో ప్రస్తుతం రీతూ చౌదరి చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. ఇక రీతూ చౌదరి విషయానికొస్తే.. గోరింటాకు, సూర్య వంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను షేర్ చేస్తూ నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. మరి రేవ్ పార్టీ గురించి రీతూ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker