యూట్యూబర్స్ హర్షసాయి వీడియోస్ ఎందుకు చేయడం లేదో తెలుసా..?

యూట్యూబర్స్ లో టాప్ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు హర్ష సాయి. యూట్యూబర్‌గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. అంతే కాదు తన యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచుతూ.. తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక పేదలకు వారి డ్రీమ్ ఏంటో అడిగి.. వారికి కావలసిన వస్తువులు సమకూర్చుతున్నాడు హర్ష.
అంతేనా..చదువుకోవాలని ఉండి.. కష్టాలుపడుతున్న పేద విద్యార్ధుల అవసరాలు కూడా తీరుస్తున్నాడు హర్షసాయి. పెదవారి కల్లల్లో సంతోషాన్ని చూస్తున్నాడు హర్ష. చాలా చిన్న వయస్సులో.. సంపాదించడమే ఎక్కువ అటువంటిది ఆదాయం మొత్తాన్ని పేదలకు పంచి పెడుతున్నాడు.

అయితే యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హర్షసాయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా హర్షసాయికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు. దీనికి ఓ కారణం ఉందట. ఆయన త్వరలోనే హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ ఫేం మిత్రాశర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. మరి యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన హర్షసాయి హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చూడాల్సి ఉంది.