Heart Attack: గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు మనిషిలో కనిపించే లక్షణాలు ఇవే.

Heart Attack: గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు మనిషిలో కనిపించే లక్షణాలు ఇవే.
Heart Attack: గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు.. ఈ పరిస్థితి మరింత ప్రమాదకరమైనది.. ఎందుకంటే ఇది కొన్ని నిమిషాల్లోనే మరణానికి దారితీస్తుంది. అపోలో హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వరుణ్ బన్సాల్ హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ గురించి వివరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల చాలా మంది గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గుండెపోటు రాకముందే మన శరీరం ఈ సంకేతాలను మనకు ఇస్తుంది. కొంతమందిలో ఈ లక్షణాలు అరగంట ముందుగానే కనిపిస్తాయి.. అలాంటి వాటిని అస్సలు అశ్రద్ధ చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు లక్షణాలు..గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్.. గుండె కండరాలకు రక్త ప్రవాహం అడ్డుపడినప్పుడు సంభవించే తీవ్రమైన వైద్య పరిస్థితి.
Also Read: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు.
దీని కారణంగా గుండె కండరాలు దెబ్బతింటాయి లేదా మరణిస్తాయి. గుండెపోటుకు ముందు, ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, ఎగువ శరీరంలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.. హార్ట్ బ్లాక్ లక్షణాలు..గుండె మూసుకుపోవడం అంటే గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవడం లేదా పూర్తిగా నిలిచిపోవడం.. ఇది సాధారణంగా కరోనరీ ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల వస్తుంది.
Also Read: మీ తెల్ల జుట్టుని ఈ చిట్కాలు ద్వారా 5 నిమిషాల్లోనే నల్లగా మార్చుకోవచు.
గుండెపోటు లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి.. పొటాషియం స్థాయిలు పెరగడం మొదలైన వాటి వల్ల గుండె సమస్యలు సంభవించవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.. హార్ట్ బ్లాక్ అయ్యే లక్షణాలు చాలా వరకు సకాలంలో గుర్తించబడవు. దీని కారణంగా.. చాలా సందర్భాలలో, ఎటువంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు వస్తుంది. గుండెలో బ్లాక్ ఉందో లేదో ఎలా గుర్తించాలి? అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

పై నుండి వచ్చే ఛాతీ నొప్పి.. అది నొక్కినట్లు, మండుతున్నట్లు లేదా పదునైనదిగా తీవ్రంగా ఉండవచ్చు. శారీరక శ్రమ, ఒత్తిడి లేదా తినడం తర్వాత ఇది మరింత తీవ్రమవుతుంది. ఎవరో మీ ఛాతీని నొక్కినట్లు.. అదిమినట్లు అనిపిస్తుంది. ఇంకా వేగంగా గుండె కొట్టుకుంటుంది. శారీరక శ్రమ చేయలేకపోవడం.. తక్కువ శారీరక శ్రమ ఉన్నప్పటికీ.. మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు లేదా శ్వాస ఆడకపోవడం..
విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నిరంతరం అలసట.
Also Read: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..?
లేచి నిలబడి ఉన్నప్పుడు లేదా ఆకస్మిక కదలికలు చేసినప్పుడు తల తిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోయినట్లు అనిపించడం. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు కాళ్ళలో నొప్పి. ఈ నొప్పి చాలా తరచుగా కుడి కాలులో అనుభూతి చెందుతుంది. ఎటువంటి కారణం లేకుండానే అధికంగా చెమట పట్టడం. తరచుగా అజీర్ణం లేదా గుండెల్లో మంటగా అనిపించడం. కొన్ని సందర్భాల్లో, నొప్పి మెడ, దవడ, భుజాలు, లేదా వీపుకు కూడా వ్యాపించవచ్చు. వికారం, వాంతులు, లేదా మైకం కూడా గుండెపోటు లక్షణాలుగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: నేరేడు గింజలను ఇలా చేసి తీసుకుంటే చాలు.
గుండెపోటును ఇలా నివారించవచ్చు..గుండెపోటును నివారించడానికి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నిర్వహించడం వంటి గుండెకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి పెట్టండి. ధూమపానం, అధికంగా మద్యం సేవించడం మానుకోవడం కూడా చాలా ముఖ్యం.. ఏమైనా లక్షణాలను గమనించినట్లయితే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.