Health

ఈ చిన్న రక్తపరీక్ష ద్వారా మీకు భవిష్యత్తులో గుండె పోటు వస్తుందో.. లేదో.. తెలుసుకోవచ్చు.

గుండె పోటు వచ్చేటప్పుడు సంకేతాలుగా తొలుత అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి ప్రారంభమవుతుంది. ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుంది. ఆ వెంటనే విపరీతంగా చెమటలు కనపిస్తాయి. వీటిని మనం వెంటనే గుర్తించకపోతే అది మనల్ని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజుల్లో ఎప్పుడు ఎవరికి గుండె పోటు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్టు ఉండి గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి రోజూ టీవీ, పేపర్లలో చూస్తూనే ఉంటున్నాం. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఇది.

ప్రాణాంతకంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధమనుల్లో ఫలకం పేరుకుపోయి అడ్డంకిగా మారినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. ఈ ఫలకం పగిలితే రక్తం గడ్డకడుతుంది. దీని కారణంగా రక్తం, ఆక్సిజన్ గుండెకి చేరడం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో గుండె కండరాలకు కోలుకోలేని నష్టం జరిగి ప్రాణాంతకం అవుతుంది. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య జీవనశైలి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా గుండె పోటుకు గురవుతారు.

గుండె పోటు లక్షణాలు..ఛాతీ నొప్పి, ఛాతీలో బిగుతుగా అనిపించడం, అసౌకర్యంగా ఉండటం, అలసట, చిరు చెమటలు, గుండెల్లో మంట, వికారం, శ్వాస ఆడకపోవడం, గుండె కండరాల నొప్పి, దవడ లేదా చేయి లేదా పై భాగంలో లాగుతున్నట్టుగా అనిపించడం, అజీర్ణం, లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా కూడా వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకుంటే గుండె పోటు నుంచి బయట పడొచ్చని నిపుణులు వెల్లడించారు. గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ముందుగా కొన్ని పరీక్షలు చేస్తారు.

ఈసీజీ(ECG)..గుండెల్లో అసౌకర్యంగా ఉందని హాస్పిటల్ కి వచ్చిన వెంటనే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్ష చేస్తారు. ఇది గుండె నుంచి విద్యుత్ సిగ్నల్స్ ని రికార్డ్ చేస్తుంది. గుండె కొట్టుకునే దాన్ని బట్టి గుండె పోటు వచ్చిందో లేదో గుర్తిస్తుంది. అయితే కొన్ని సార్లు గుండె పోటు అనేది ఈసీజీలో కనిపించదు. ఎక్స్ రే..ఛాతీ ఎక్స్ రే లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ వంటి ఇమేజింగ్ పరీక్షలు కూడా గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సహాయపడతాయి. గుండెకి జరిగిన నష్టాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది.

రక్తపరీక్ష..గుండె పోటు సంభవించినప్పుడు గుండె నుంచి కండరాల ప్రోటీన్లు దెబ్బతిన్న కండరాల నుంచి రక్తంలోకి విడుదల అవుతాయి. మయోగ్లోబిన్, ట్రోపోనిన్ I, ట్రోపోనిన్ R వంటి గుండె కండరాల ప్రోటీన్లు రక్తంలోకి వస్తాయి. వీటిని గుర్తించేందుకు రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ టెస్ట్ చేస్తారు. ఈ రోగనిర్ధారణ పరీక్షలు గుండె పోటు వచ్చిందో లేదో చెప్పేందుకు సహాయపడతాయి. ఈ ప్రోటీన్లు సాధారణంగా గుండె పోటు వచ్చిన 6 నుంచి 12 గంటల్లోపు పెరుగుతాయి. 48 గంటల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయి. ట్రోపోనిన్ వంటి ప్రోటీన్ల దాడి జరిగిన పది రోజుల తర్వాత కూడా గుర్తించవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker