News

రేవ్ పార్టీ కేసులో నటి హేమ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, వెలుగులోకి షాకింగ్ విషయాలు.

హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేయగా 150 మంది హాజరయ్యారని తెలిపారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగు వారు ఫిర్యాదు చేశారు. అయితే రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రముఖంగా నటి హేమ పేరు వినిపించింది.

బెంగుళూరు పోలీసులు నటి హేమ ఫోటో సైతం విడుదల చేశారు. రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను హేమ ఖండించారు. ఆమె ఒక వీడియో బైట్ విడుదల చేశారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి నేను అటెండ్ అయ్యాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ లో గల ఓ ఫార్మ్ హౌస్ లో నేను చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. పుకార్లను నమ్మవద్దు అని, సదరు వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. పోలీసులు విడుదల చేసిన ఫోటోలో వేసుకున్న డ్రెస్ లోనే హేమ వీడియో బైట్ చేసింది.

ఇది అనుమానాలకు దారి తీసింది. అనుమానించినట్లే హేమ అందరినీ తప్పుదోవ పట్టించింది. రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ నుండే వీడియో చేసిన హేమ హైదరాబాద్ లో ఉన్నట్లు అబద్దం చెప్పింది. ప్రస్తుతం హేమ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవిని బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు స్పష్టత వచ్చింది.

ఓ ప్రముఖుడి బర్త్ డే నేపథ్యంలో బెంగళూరు వేదికగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. నిషేదిత ఉత్ప్రేరకాలు పార్టీలో వినియోగించారని సమాచారం. మొత్తం 100 మంది ఈ పార్టీలో పాల్గొనగా 70 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలు అట. నటుడు శ్రీకాంత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన నివాసం నుండి వీడియో విడుదల చేశారు. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, నాకు అలాంటి అలవాట్లు లేవని చెప్పుకొచ్చారు. రేవ్ పార్టీ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు విచారిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker