రైతుబిడ్డ ముసుగులో పల్లవి ప్రశాంత్ సైడ్ బిజినెస్, లక్షలు వసూలు చేస్తున్న బిగ్ బాస్ విన్నర్.
అసాధారణ ఆటతీరుతో విజేతగా నిలిచాడు. తద్వారా తన రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అయితే, షోలో ఉన్నప్పుడు తనకు వచ్చిన డబ్బును రైతుల కుటుంబాలకు పంచుతానని చెప్పిన అతడు.. ఆ పని చేయకపోవడంతో విమర్శలపాలు అయ్యాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్. ఒక సామాన్యుడు టైటిల్ కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కామనర్ టైటిల్ కొల్లగొట్టాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి ఆ ట్యాగ్ కూడా ప్లస్ అయ్యింది.
ఫినాలే రోజు కొన్ని అనుచిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ఎదుట అల్లర్లకు పాల్పడ్డారు. పోలీసుల సూచనలు పక్కన పెట్టి ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదం అయ్యింది. కేసులు పెట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అత్తని తమ్ముడిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల అనంతరం పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్ స్టార్ మా లో ప్రసారమైన కొన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నాడు.
అలాగే తోటి కంటెస్టెంట్స్ తో గెట్ టుగెదర్ పార్టీలు ఎంజాయ్ చేశాడు. హౌస్లో తనతో సన్నిహితంగా ఉన్న శివాజీ, ప్రిన్స్ యావర్ లను పలుమార్లు కలిశాడు పల్లవి ప్రశాంత్. అయితే పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. తాను టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ పేద రైతులకు పంచేస్తానని పల్లవి ప్రశాంత్ మాట ఇచ్చాడు. బిగ్ బాస్ షో ముగిసి ఐదు నెలలు అవుతున్నా పల్లవి ప్రశాంత్ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఒక లక్ష రూపాయలు మాత్రం పంచి పెద్ద ఆర్భాటం చేశాడు. మిగతా డబ్బులు కూడా పంచి వీడియోలు షేర్ చేస్తానని అన్నాడు.
లక్ష రూపాయలు పంచి సైలెంట్ అయిపోయిన పల్లవి ప్రశాంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని గురు శివాజీని కూడా నెటిజెన్స్ ఏకి పారేస్తున్నారు. మిగతా డబ్బులు ఎప్పుడు పంచుతారని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ తన ఫేమ్ ని బాగానే వాడుకుంటున్నాడట. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి వెళుతూ డబ్బులు ఛార్జ్ చేస్తున్నాడట. రూ. 2 నుండి 5 లక్షల వరకు ఒక ఈవెంట్ కి కలెక్ట్ చేస్తున్నాడట. నెలకు పల్లవి ప్రశాంత్ సంపాదన రూ. 20 లక్షల పైనే అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అతనికి మరికొంత డబ్బులు లభిస్తుంది. మొత్తంగా పల్లవి ప్రశాంత్ ఆర్థికంగా సెటిల్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది..