Health

హై బీపీ నిమిషాల్లో తగ్గించే డ్రింక్స్ ఇవే, తాగే ముందు ఒకసారి..?

వందకు 70 శాతం మంది రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. వేగంగా మారుతున్న జీవనశైలి, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలలోని ఒత్తిడి, అధిక బరువు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, ధూమపానం, శారీరకంగా శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి హై బీపీ రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, రక్తపోటును తగ్గించడానికి మందుల కంటే చికిత్సలో జీవనశైలి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో రక్తపోటును నియంత్రించడం ద్వారా మందుల అవసరాన్ని నిరోధించవచ్చు,

ఆలస్యం చేయవచ్చు లేదా తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో బీపీ సమస్యలు సర్వసాధారణం. అయితే వీటివల్ల గుండెజబ్బులు తతెత్తుతున్నాయి. దీంతో పాటు మధుమేహం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి. పని ఒత్తిడి, చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు అధిక రక్తపోటుకి కారణం అవుతున్నాయి.

హైబీపీని నివారించాలంటే రోజువారీ దినచర్యలో కొన్ని మార్పులతో పాటు తాజా పండ్ల రసాలు తీసుకోవాలి. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్‌ రసం బీట్‌రూట్‌లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తాన్ని పెంచడంలో బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మ రసం.. దానిమ్మలో విటమిన్లు, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. టమోటా రసం టొమాటోలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిని పచ్చిగా తినడం లేదా రోజూ 1 గ్లాసు జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker