News

ఇంట్లోనే రాముడిని ఇలా పూజించండి. మీరు అయోధ్యకి వెళ్లి పూజ చేసిన ఫుణ్య ఫలం పొందుతారు.

యావత్ దేశమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రామ్ లల్లాను ప్రతిష్టించనుండగా.. సాయంత్రం శ్రీ రామ జ్యోతి వెలిగించనున్నారు. ఈ రోజున ఇంట్లో ఆచార నియమాల ప్రకారం శ్రీరాముడిని పూజిస్తే పుణ్యం లభిస్తుంది. ఇంట్లో రాముడిని ఎలా పూజించాలి.. జనవరి 22న వేకువజామున నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి. మీ ఇంట్లోని పూజా మందిరంలో ఇక పీఠం వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమని దాని మీద పెట్టాలి. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజ చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చోవాలని విషయం మాత్రం మరవద్దు.

ధూపం, ధీపం వేయాలి. రాముని అనుగ్రహం పొందటం కోసం పుష్పాలు సమర్పించాలి. స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి. శ్రీరామునితో పాటు ఆయన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించడం మంచిది. ఈ పవిత్రమైన రోజున రామ చరిత మానస్, శ్రీరామ రక్ష స్త్రోత్రం, సుందర కాండని పారాయణం చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుందనిచ పండితులు చెబుతున్నారు. అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు దూరదర్శన్ చానెల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

అక్కడ వేద పండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షితలు ఇంటింటికీ పంచారు. పూజ సమయంలో పండితులు చెప్పినప్పుడు ఆ అక్షితలు ఇంట్లో అందరూ తల మీద వేసుకోవడం వల్ల శ్రీరాముడు ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతారు. ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్టించి పూజించడం వల్ల అయోధ్యకి వెళ్లకపోయినా అక్కడికి వెళ్ళిన పుణ్యం మీకు దక్కుతుంది.

ఆరోజుకి మరొక ప్రత్యేకత..అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆరోజు కూర్మ ద్వాదశి వచ్చింది. క్షీర సాగర మథనం సమయంలో విష్ణు మూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. విష్ణు సహస్ర నామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అయోధ్యలో జరగబోయే క్రతువులు..అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి.

గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని పెట్టారు. జనవరి 20, సరయూ పవిత్ర నదీ జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేశారు. జనవరి 21న 125 కలశాలతో వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో రామ్ లల్లాకి దివ్య స్నానం చేయిస్తారు. జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker