ఇన్‌స్ట్రాగామ్ లో పరిచయం, ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందు అనే యువకుడు, ఖమ్మం జిల్లాకు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్ కు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ వేధికగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలపడంతో ఆ జంటకు ఏన్కూరులోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయలంలో వివాహం జరిపించారు.
అయితే ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మూడేళ్ల పాటు ప్రేమించిన ట్రాన్స్‌జెండర్‌ను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం (జనవరి 21) జరిగింది. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఆజ్మీర నందు అనే యువకుడితో మూడేళ్ల క్రితం ఇన్‌స్టా గ్రాంలో పరిచయం ఏర్పడింది.
వీరి పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా మారింది. దీందో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరి ప్రేమను నందు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ట్రాన్స్‌జెండర్‌లు ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నందు, నక్షత్రలకు ఆదివారం ఘనంగా పెళ్లి చేశారు.