Health

తేనెలో వీటిని కలిపి ఉదయాన్నే తింటే.. ఏం జరుగుతుందో ఊహించలేరు.

పరగడుపున తేనె తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బరువు తగ్గడానికి, జలుబు నుంచి బయటపడటానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకోవచ్చు. ఇది రోజంతా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే చలికాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. మిగిలిన సీజన్లతో పోలిస్తే చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు త్వరగా ఎటాక్ చేస్తుంటాయి.

దోమల బెడద కూడా ఎక్కువగా ఉండటం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకుతుంటాయి. అన్నింటికీ మించి చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. చలికాలంలో ఈ సమస్యలన్నింటికి ఒక్కమాటలో పరిష్కారమంటే తేనె అత్యద్బుతమైన ఔషధమని అంటారు ఆయుర్వేద వైద్య నిపుణులు. తేనెలో ఉండే వివిధ రకాల పోషకాల వల్ల ఆరోగ్యం సంరక్షించుకోవచ్చు. ముఖ్యంగా తేనెను ఎండు ద్రాక్షతో కలిపి తీసుకుంటే ప్రయోజనాలు చాలా ఎక్కువ.

ఎందుకంటే ఈ రెండింట్లోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తేనె, ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఔషధమిది. దీనికోసం ఓ గాసు సీసాలో తేనె, ఎండు ద్రాక్ష వేసి రెండ్రోజులు అలానే ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపున ఒక చెంచా నేరుగా తీసుకోవాలి. ఈ మిశ్రమం తీసుకోడానికి అరగంట ముందు, తరువాత ఏం తినకూడదు.

రోజూ క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి వేగంగా పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలుంటే తగ్గిపోతాయి. గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. ఎముకల నొప్పులు, కాలి నొప్పులు తగ్గుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగడం వల్ల అలసట పోతుంది. హార్ట్ బీట్ అదుపులో వస్తుంది. అంతేకాకుండా చర్మం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చేయడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తవు.

ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిస్తే 12-15 రోజులు నిల్వ ఉంటుంది. అలా పదిహేను రోజులకోసారి మిశ్రమం సిద్ధం చేసుకుని సేవిస్తే ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. తేనె, ఎండు ద్రాక్షలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి12 వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో దోహదపడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker