Health

PCOD సమస్య అంటే ఏమిటి..? ఆ సమస్య ఎలాంటి వారికీ వస్తుందో తెలుసుకోండి.

PCOD అనేది అండాశయాలు అనేక అపరిపక్వ లేదా పాక్షికంగా పరిపక్వమైన గుడ్లను ఉత్పత్తి చేసే పరిస్థితి, ఇది పేలవమైన జీవనశైలి, ఊబకాయం, ఒత్తిడి మరియు హార్మోన్ల అసమతుల్యత కారణంగా జరుగుతుంది. PCOS అనేది మెటబాలిక్ డిజార్డర్ మరియు PCOD యొక్క మరింత తీవ్రమైన రూపం అండాశయాలు గుడ్లను విడుదల చేయడం ఆపివేయడానికి దారితీయవచ్చు. అయితే PCOD అంటే..పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్(PCOD) అనేది మహిళల అండాశయంలో ఏర్పడే నీటి బుడగలు..అయితే ఈ సమస్య కారణంగా చాలా మంది మహిళలు వారి మాతృత్వానికి దూరమవుతున్నారు.

PCOD సమస్యల కారణంగా పీరియడ్స్‌లో సమస్యలు కూడా వస్తాయి. తరచుగా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్(PCOD) సమస్యలతో బాధపడేవారి శరీరంలో కూడా మార్పులు వస్తాయి. దీని కారణంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, తీవ్రమైన ఒత్తిడికి గురవడం, హార్మోన్ల ఇన్‌ బ్యాలెన్స్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే ముందుగానే గ్రహించి వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.

PCODకి చెక్‌ పెట్టే ఆహారాలు ఇవే:- బాదం.. బాదంలో మోనోసాచ్చురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి ఈ PCOD సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బాదం తీసుకుంటే హార్మోన్ల ఇన్‌ బ్యాలెన్స్‌ను పూర్తిగా తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బాదంలో ఉండే ప్రోటీన్స్‌ శరీరాన్ని దృఢంగా చేసేందు సహాయపడుతుంది. వాల్‌నట్స్.. వాల్‌నట్స్‌లో వివిధ రకాల పోషకాలు లభిస్తాయి.

కాబట్టి వీటిని రోజు తినడం వల్ల పీరియడ్స్‌లో వచ్చే సమస్యలను పరిష్కరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి డైరెక్ట్‌గా తీసుకోకుండా రాత్రి నీటిలో నానబెట్టి పొట్టు తీసుకొని తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజలు.. గుమ్మడి గింజలల్లో కూడా శరీరానికి కావాల్సిన షోషకాలు లభిస్తాయి. వీటిని రోజు ఆహారంలో కూడా తీసుకోవచ్చు.

PCOD సమస్య ఉన్నవారు రోజు ఒక గుప్పెడు గింజలు తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. నీరు..నెలసరి సమయంలో చాలా మంది నీరు తాగకుండా ఉంటారు. ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పీరియడ్స్‌లో ఉన్నవారు రోజుకు లీటర్‌ నీరు తాగడం చాలా అవసరం. నీరు బాగా తాగడం వల్ల శరీంర తేలికగా తయారవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker