News

హౌస్ లో రెచ్చిపోయిన రతిక, దీంతో రతిక బండారాన్ని బయటపెటిన షకీలా.

బిగ్ బాస్ సీజన్ 7 తొలి వారం అంతా గందరగోళంగా మారింది. అంతా మారిపోయింది అని చెప్పారు కానీ.. గందరగోళం అవుతోందనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. హౌస్ లో 11వ రోజు బుధవారం జరిగిన ఎపిసోడ్ లో రతిక రోజ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే గెలుచుకునేందుకు అర్హులు గా నిలుస్తారని తెలిపాడు బిగ్ బాస్. బిగ్ బాస్ చెప్తే వినాలిగా ఇలానే చేశారు హౌస్ లో ఉన్నావారు. రెండో అస్త్ర గెలుచుకున్న వారికి నాలుగు వారల ఇమ్యూనిటీ వస్తుందని.. అలాగే ఎలిమినేషన్ నుంచి కూడా బయటపడతారని తెలిపాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మహాబలి టీమ్ లో ఉన్న వారు నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అంటూ గొడవపడ్డారు.

ముఖ్యంగా రతిక ఈసారి చాలా డ్రామా చేసింది.ముందుగా శుభ శ్రీ శోభా శెట్టి నుంచి మాయాస్త్ర భాగాన్ని తీసుకొని ప్రిన్స్ యావర్ కు ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ అమర్‌ దీప్ దగ్గర నుంచి తీసుకొని శివాజీకి ఇచ్చాడు. ఆతర్వాత అసలు డ్రామా మొదలైంది. రణధీర టీంలో శివాజీకి ఎక్కువ మాయాస్త్ర భాగాలను ఇచ్చి ఆయనను విన్నర్ ను చేస్తా అంటూ తన టీమ్ తో చెప్పింది రతిక. అందుకు ఒప్పుకోలేదు టీమ్ మెంబర్స్. అలాగే తాను ఆరోస్థానంలో వెళ్తాను అని రతిక చెప్పడంతో తన టీమ్ లో ఉన్నవారు అందుకు కూడా ఒప్పుకోలేదు. దాంతో రతిక రెచ్చిపోయింది. ముందుగా తన టీమ్ మెంబర్ అయిన దామినిపై రెచ్చిపోయింది.

దామిని ఎదో చెప్తుంటే వినకున్నా తన పై అరిచి గోల చేసింది. నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తా.. సైలెంట్‌గా ఉన్నానని రెచ్చిపోకు అంటూ ఫైర్ అయ్యింది. దాంతో దామిని కూడా అమ్మడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎంతసేపు తిప్పితిప్పి అదే డ్రామా అంటూ రతిక పై రెచ్చిపోయాడు. దాంతో రాతిక అతని పై కూడా చిందులేసింది. ఏంటి రెచ్చిపోతున్నావ్.. సైలెంట్‌గా ఉన్నాను కదా అని అరుస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యింది. దాంతో దామిని సరే ఆ టీమ్ లోకి వెళ్ళిపో అని అనడంతో .. నువ్వెవ్వరు నన్నువెళ్ళు అనడానికి .. నువ్ చెప్తే నేను వినాలా.. అని అరిచి గోల చేసింది. టీఆర్పీ కోసమే కదా ఇలా రెచ్చిపోతున్నావ్ అని దామిని అనడం తో అవును ఏం చేస్తావ్ అంటూ రెచ్చిపోయింది మన రతిపాప.

దాంతో భోరున ఏడ్చేసింది దామిని. ఇక తన వంతు వచ్చినా కూడా కూడా తాను వెళ్ళటానికి మొండికేసింది రతిక . అంతే కాదు ఆతర్వాత తన టీమ్ గురించి కామెంట్స్ చేసింది. తన టీమ్ లో ఉన్న వారందరూ బఫూన్స్ అంటూ ఇష్టమొచ్చినట్టు వాగింది. చండాలమైన టీమ్ అంటూ మాట్లాడింది. తాను టీమ్ మారతా అని చెప్పడంతో సందీప్ అందుకు ఒప్పుకోలేదు. రెండు రోజుల నుంచి ఇదే టీమ్ లో ఉంటూ ఇప్పుడు టీమ్ మారుతా అనడం కరెక్ట్ కాదు అని తెలిపాడు. పైగా నీ టీమ్ ను బఫూన్స్ అంటున్నవ్..? అని ప్రశ్నించాడు. దానికి రతిక ‘అవును మరి వీళ్లు అట్లాగే బిహేవ్ చేస్తున్నారు.. అంటూ పొగరుగా సమాధానం చెప్పడంతో గౌతమ్ కు మండిపోయింది.

ఈమెకు క్లారిటీ లేదు.. ఫస్ట్ వెళ్తానని చెప్పింది.. ఆతర్వాత సెకండ్ అన్నది.. ఫోర్త్ అన్నది.. ఇప్పుడు లాస్ట్ అంటుంది.. అందర్నీ మాటలని నోరు జారుతుందని ఫైర్ అయ్యాడు. చివరకు షకీలా రాతిక బండారాన్ని బయటపెటేసింది. కంటెంట్ ఇవ్వడం కోసం ఆమె ట్రై చేస్తుంది.. ఎంత సేపు గోల చేస్తే అంత కంటెంట్ వస్తుందని రతిక ప్రయత్నం.. ఇవ్వనివ్వండి’ అంటూ అసలు విషయం చెప్పేసింది. గత ఎపిసోడ్ లో రైతు బిడ్డ పై అందరు నామినేషన్ సమయంలో సీరియస్ అవ్వడంతో అతను ఏడ్చినంత పని చేసి సింపథీ కొట్టేశాడు ఇప్పుడు రతిక కూడా అదే చేస్తుందని చూస్తున్న వారందరికీ అర్ధమవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker