ఆ విషయం గురించి చెప్తూ గదిలో ఒంటరిగా కూర్చోని ఏడ్చిన ఇలియానా.
గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం బిడ్డతో మాతృత్వం ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అయితే ఇలియానా భర్త విషయంలో మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఓ ఫోటో ఒకటి షేర్ చేసింది. కానీ అతని గురించి వివరాలు ఏమి చెప్పలేదు. మొదటిసారి ఇలియానా తన భర్త గురించి మాట్లాడింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా తన ప్రగ్నెన్సీ, సినిమాలు, తన భర్త గురించి మాట్లాడింది.
ఇలియానా మాట్లాడుతూ.. నేను బిడ్డ పుట్టాక చాలా డిప్రెషన్ కి గురయ్యాను. చాలా ఏడ్చాను. నా బాబు వేరే గదిలో పడుకుంటే డాక్టర్లు బాగా చూసుకున్నారు. నేను ఇంకో గదిలో ఉండి ఏడ్చాను. ఆ సమయంలో నాకు మైఖేల్ డోలన్(ఇలియానా భర్త) తోడుగా నిలబడ్డాడు. నన్ను రెస్ట్ తీసుకొమ్మని చెప్పి బాబుని తనే చూసుకున్నాడు.
ఇంత మంచివాడు నాకు తోడుగా రావడం నా అదృష్టం. నేను ఏమి చెప్పకుండానే నాకు కావాల్సినవి అన్ని చేస్తాడు అని చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా భర్త మైఖేల్ డోలన్ అని చెప్పి, అతను తనని ఎంత బాగా చూసుకుంటాడో చెప్పింది కానీ మళ్ళీ అతని గురించి పూర్తిగా వివరాలు చెప్పలేదు.
అతని విషయంలో మాత్రం ఇలియానా ప్రైవసీ మెయింటైన్ చేస్తూనే వస్తుంది.