News

చీరకట్టులో శ్రీకాంత్ కూతుర్ని చూశారా..! ఎంత అందంగా ఉందో చుడండి.

తాజాగా నేడు తిరుమల శ్రీవారిని శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాంత్ తన భార్య ఊహ, పిల్లలు రోషన్, మేధాతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, టిటిడి అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అయితే ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. కాగా శ్రీకాంత్ కి రోషన్ కాకుండా మరో కొడుకు రోహన్, కూతురు మేధ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు శ్రీకాంత్, ఊహ పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా తిరుముల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఇక అక్కడ శ్రీకాంత్ ఫ్యామిలీని చూసిన జనాలు వారితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించగా.. శ్రీకాంత్ ఫ్యామిలీ కూడా వారికీ సెల్ఫీలు ఇచ్చి ఆనందపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీకాంత్ కూతురు ‘మేధ’ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

చీరలో సంప్రదాయపద్ధతిగా అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఇక చీరలో మేధ అందం చూసిన మరికొంతమంది ఆమె హీరోయిన్‌లా ఉంది, ఆమె తల్లి ఊహలా ఆమె కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మేధ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరి శ్రీకాంత్, ఊహ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు కూడా చూసేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker