News

దేశంలో భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు, మళ్ళీ మాస్కులు పెట్టుకోవాల్సిందే.

హెచ్1ఎన్1 వైరస్ వల్ల గతంలో ఒక మహమ్మారిని చవి చూశాం. ఇప్పుడు దానికి సంబంధించిన సాధారణ వేరియంటే హెచ్3 ఎన్2 . దానిలో స్వల్పస్థాయిలో ఉత్పరివర్తనలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా దీని ప్రభావానికి గురవుతున్నారని వెల్లడించారు. అయితే ఆస్పత్రిలో చేరికలు భారీస్థాయిలో లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసులు పెరగడానికి గల రెండు కారణాలు వెల్లడించారు.

ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులు, అలాగే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించక పోవడం ఇందుకు కారణమన్నారు. అయితే హెచ్3ఎన్2 వైరస్​ కారణంగా ఇన్‌ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయని, కరోనా లాగానే విస్తరిస్తోందని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్​ డాక్టర్ రణ్​దీప్​ గులేరియా చెప్పారు. పండగల సీజన్​ మొదలుకావడంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, కోమర్బిడ్ పరిస్థితులు కలిగి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరంతో పాటు గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు మొదలైన లక్షణాలతో ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదవుతున్నాయని గులేరియా చెప్పారు.

వైరస్ మార్పు చెందడం, దానిపై ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడమే దీనికి కారణమన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెచ్3ఎన్2 వైరస్‌ విజృంభిస్తోంది. అక్కడ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో అత్యవసర వార్డులు కిక్కిరిపోతున్నాయి. నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు.

వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అక్కడి ఎమర్జెన్సీ వార్డులు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్3ఎన్2 అనేది ఒక ఇన్​ఫ్లుయెంజా వైరస్. దీనినే ఇన్‌ఫ్లుయెంజా ఏ వైరస్​ అని కూడా పిలుస్తారు. ఇది శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రతి ఏటా అనారోగ్యాలను కలిగిస్తుంది. మనుషుల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సబ్​ టైప్​లను 1968లో గుర్తించారు.

ఇన్‌ఫ్లుయెంజా ఏ వైరస్.. హెమాగ్లుటినిన్(హెచ్ఏ), న్యూరామినిడేస్ (ఎన్ఏ) ప్రోటీన్ జాతుల నుంచి వచ్చింది. హెచ్ఏలో 18కిపైగా విభిన్న సబ్​ టైప్స్ ఉన్నాయి. జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒంటి నొప్పులు, చలి, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌కు ఇచ్చే టీకాలను తీసుకోవడం ద్వారా కూడా వైరస్​ బారిన పడకుండా ఉండొచ్చు. ఒకవేళ సింప్టమ్స్​ తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌​ను సంప్రదించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker