News

కరోనా వ్యాక్సిన్ వల్లే హార్ట్‌ఎటాక్స్ వస్తున్నాయా..? డాక్టర్స్ ఏం చెప్పారంటే..?

ఇటీవలి కాలంలో పెరుగుతున్న గుండె జబ్బుల కేసులకు కారణం కరోనా ఎఫెక్టేనని అనుమానిస్తున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అన్ని వయసుల వారు గుండె జబ్బుల బారిన పడుతున్న కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. చాలా మంది గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోతున్నారు. గతంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 10 నుంచి 15 శాతం దాకా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. హర్వార్డ్ పరిశోధకుల అధ్యయనంలో కూడా ఇదే రకమైన ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఒకప్పుడు గుండె జబ్బులు 50 ఏళ్లు దాటినవారికే వచ్చేవి.. మరి ఇప్పుడేమో యువతకు కూడా వస్తున్నాయి.

చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ధమనుల్లో రక్త ప్రసరణ కు ఆటంకం కలుగుతోంది. ఐతే.. రొమ్ము దగ్గర వచ్చే ప్రతీ నొప్పీ హార్ట్ఎటాక్ కాదు. రొమ్ముతోపాటూ.. దవడలు, భుజం దగ్గర కూడా నొప్పి వస్తే.. అది హార్ట్ ఎటాక్ అని గుర్తించాలి. ఈ హార్ట్ఎ‌టాక్‌లకు కరోనా సమయంలో వేయించుకున్న కోవిషీల్డ్ వ్యాక్సినే కారణం అనే ప్రచారం జోరుగా ఉంది. దీనిపై మనీకంట్రోల్ సంస్థ.. దేశంలోని ప్రముఖ కార్డియాలజీస్టులను సంప్రదించి. “హార్ట్ ఎటాక్స్ పెరగడానికి వ్యాక్సిన్లు కారణం అనేలా డేటా ఏదీ లేదు” అని డాక్టర్ బల్బీర్ తెలిపారు.

“వ్యాక్సిన్లు కాదుగానీ.. కోవిడ్ ఇన్ఫెక్షన్ల వల్ల హార్ట్ఎటాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కరోనా సోకినప్పుడు ట్రీట్‌మెంట్ కోసం వాడిన స్టెరాయిడ్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రీట్‌మెంట్ చేసిన సంవత్సరం తర్వాత ఇలా దరిగే ఛాన్స్ ఉంది” అని డాక్టర్ బల్బీర్ తెలిపారు. “తీవ్రమైన కోవిడ్ వల్ల సైటోకిన్ స్టోర్మ్ అనే కండీషన్ ఏర్పడుతుంది. సైటోకిన్ స్మోర్మ్ అనేది.. వ్యాధి నిరోధక శక్తి నుంచి వచ్చే ప్రతి తీవ్ర చర్య. దీని వల్ల టాచికార్డియా (గుండె వేగంగా కొట్టుకోవడం), అర్హిత్మియా (గుండె లయతప్పడం) వంటివి జరుగుతాయి.

ఇది జీవితాంతం ఉండదు. చాలా మంది దీని నుంచి కోలుకోగలరు” అని ఫోర్టిస్ హాస్పిటల్ ములుంద్ అండ్ కళ్యాణ్‌లో ఇన్ఫెక్షన్ వ్యాధుల స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కీర్తి సాబ్నిస్ తెలిపారు. “తీవ్రమైన కోవిడ్ వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి వస్తుంది. ఇదో రకమైన కండీషన్. ఇది వచ్చినప్పుడు గుండె కండరాలు బలహీనం అవుతాయి. ఇలా అయితే మాత్రం కోలుకునే అవకాశం ఉండదు. ఐతే.. లక్షణాలు కనిపించకుండా ఇలా జరగదు. ముందుగానే లక్షణాలు కనిపిస్తాయి” అని డాక్టర్ కీర్తి సాబ్నిస్ వివరించారు. “m-RNA తరహా వ్యాక్సిన్ విషయంలో గుండె సమస్యలు వస్తున్నాయా అనేది అధ్యయనం చేస్తారు.

ఇండియాలో ఆ తరహా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. m-RNA వ్యాక్సిన్లు గుండె కండరాలు ఉబ్బుతాయి. అది రుజువైంది కూడా. కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ కి గుండెజబ్బులు పెరగడానికీ ఎలాంటి సంబంధమూ లేదు” అని డాక్టర్ కీర్తి సాబ్నిస్ తెలిపారు. “వ్యాక్సిన్ల వల్ల హార్ట్ ఎటాక్స్ వస్తాయి అనేందుకు సిద్ధాంతపరంగా వివరణ లేదు. ఇలాంటి ఆరోపణలను రుజువు చేయడానికి మన దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉండాలి. అవేవీ లేవు. కాబట్టి మనం భయపడాల్సిన పనిలేదు. అంతేకాదు.. మనం ఈ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు” అని జెన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ముంబైలోని ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ విక్రాంత్ షా తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker