News

శివరాత్రి పర్వదినాన శివుడి సేవలో లీనమైన స్టార్ హీరోయిన్స్. వైరల్ వీడియో.

అందంగా ఉన్న ప్రతి అమ్మాయికి గుడ్‌ హార్ట్‌ ఉండదు, ఎంత పెద్ద స్టార్‌ అయినా దేవుడు ముందు అందరు సమానమే అని మరోసారి తమన్నా చాటిచెప్పారు. తమన్నాను ఇలా చూసి నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. భక్తులతో శివరాత్రి శుభకాంక్షలు చెబుతూ వారికి భక్తి, శ్రద్ధతో వడ్డిస్తున్న ఆమెపై సోషల్‌ మీడియా వేదకిగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన శివరాత్రి వేడుకలో తమన్నాతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గోన్నారు. అయితే మహాశివరాత్రి సందర్భంగా స్టార్ హీరోయిన్లు శివ భక్తిని చాటుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తురులో గల శివాలయాన్ని సందర్శించారు. శివుడి భారీ విగ్రహాం ఆదియోగి వద్ద ఇషా షౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టాప్ హీరోయిన్లు తమన్నా, పూజా హెగ్దే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివనామస్మరణతో వేడుక మారుమోగిపోయింది. పట్టు వస్త్రాల్లో తమన్నా, పూజా హెగ్దే కూడా శివుడి నామాన్ని జపిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. అయితే తమన్నా భాటియా కాస్తా శివుడి సేవలో ఎక్కువగా లీనమై పోయింది. శివుడి నామాన్ని బలంగా జపిస్తూ కనిపించింది. ఆమె ముఖ కదలికలు చూస్తేనే ఎంత భక్తి శ్రద్దలతో పూజిస్తుందో అర్థమవుతోంది.

ప్రస్తుతం తమన్నా, పూజా హెగ్దేకు సంబంధించిన ఈ డివోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ల దైవభక్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker