కరోనా భయంతో 217 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి, ఎప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా..?
సాధారణంగా ప్రజలకు రెండు డోస్‌లు మాత్రమే వ్యాక్సిన్ ను ఇచ్చారు. అతి కొద్దీ మందికి మాత్రమే బస్టర్ డోసు ఇచ్చారు. అయితే కొంతమంది 10-15 డోస్‌లు తీసుకున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఓ కేసు చర్చనీయాంశమైంది. అయితే జర్మనీకి చెందిన ఓ వ్యక్తి కేవలం 29 నెలల వ్యవధిలో 217 సార్లు కోవిడ్ టీకా తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
వైద్యుల సలహాలను పట్టించుకోకుండా ఓ 62 సంవత్సరాల వ్యక్తి వరుసగా టీకాలు తీసుకున్నాడట. అన్ని సార్లు టీకాలు తీసుకున్నా అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. తాజాగా ఆ విషయం బయటపడడంతో ఎర్లాంజెన్-న్యూరెంబర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. టీకాలకు రోగనిరోధక వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ వ్యక్తి రక్తాన్ని, లాలాజలాన్ని సేకరించారు.
పదేపదే టీకాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు క్రియాశీలతను కోల్పోతాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ జర్మన్ వ్యక్తిలో అలాంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే ఆయన ఎప్పుడూ కోవిడ్ బారినపడిన లక్షణాలను కూడా గుర్తించలేదు.
ఇంకో విశేషమేమిటంటే ఇన్ని సార్లు టీకాలు తీసుకున్నా ఆ వ్యక్తి ఒక్కసారి కూడా జ్వరం బారిన పడలేదు. కాగా, 217 సార్లు టీకాలు ఇచ్చారనే విషయంపై మాగ్డెబర్గ్ నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు అతడిపై అభియోగాలేవీ నమోదు చేయలేదు.