News

గీతాంజలి ఆత్మహత్య.. సీఎం జగన్ తీవ్ర విచారం, అసలు ఏం జరిగిందంటే..?

ఈ నెల నాలుగున ఏపీ సర్కార్ అందించిన ఇంటి పట్టాను గీతాంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని, సంతృప్తిని ఆమె వెల్లడించారు. తనకు అమ్మ ఒడితో పాటు ఇంటి పట్టా కూడా వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ వల్లే తన భార్య సూసైడ్‌ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు.. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు.

విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్‌ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఇవాళ ఆమె నివాసానికి వైసీపీ నేతలంతా వెళ్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్‌తో వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక MLAతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. కాగా.. నాలుగు రోజుల క్రితం రైలు పట్టాలపై కొనఊపిరితో ఉన్న గీతాంజలి.. నిన్న ప్రాణాలు వదిలే వరకూ ఏం జరిగింది.

ఈ ట్రోలింగ్‌ వెనుక ఏం జరిగింది అనేది ఓసారి చూస్తే.. ఇటీవల అంటే ఈనెల 4న ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుంది గీతాంజలి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత ట్రోలింగ్‌ మొదలై ఇంత వరకూ తెచ్చింది. తల్లి మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. తనకు అమ్మఒడి అందిందని, కుటుంబ సభ్యులకు మిగతా పథకాలు కూడా అందుతున్నాయని చెప్పినందుకే ఇలా ట్రోల్‌ చేస్తారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

తెనాలిలో గీతాంజలి మృతిపై BC కమిషన్ సీరియస్ అయింది.. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు మారేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే, స్థానిక పోలీసులతో మాట్లాడిన మారేష్ కుమార్.. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker