News

దేవి సినిమాలో షూటింగ్‌లో నిజంగానే పాము కాటేసింది, షాకింగ్ విషయం చెప్పిన ప్రేమ.

నటి ప్రేమ.. మనుషులన్నాక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రపంచం చాలా పెద్దది. ఏదో ఒక పని చేస్తే.. డైవర్ట్ అయిపోవచ్చు. పెళ్లి అనేదే జీవితం కాదు. ఇంకా వేరే జీవితం చాలా ఉంది. నీకు అన్ని శక్తులు ఉన్నాయి.. ఛాలెంజ్‌ గా తీసుకుంటే చాలు.. స్ట్రాంగ్ అవుతారు. ఇక రెండో పెళ్లి అంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏమీ తెలియకుండా అలా ఎలా రాస్తారో నాకయితే తెలియదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి నటి ప్రేమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రేమ మాట్లాడుతూ.. అప్పట్లో లేడీ ఓరియేంటేడ్ సినిమాలు అంటే చాలా పెద్ద రిస్క్ అయినా కూడా కోడిరామకృష్ణ ఈ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు అని తెలిపింది ప్రేమ. ఆ సినిమా అంతే పెద్ద విజయం సాధించడానికి కారణం కోడిరామకృష్ణ అని అన్నారు ప్రేమ. ఒకొక్క సీన్ కు 50 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు ప్రేమ.

ఆయన నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించారు. గెటప్ వేసిన తర్వాత దేవత ఎలా మాట్లాడుతుందో.. ఆమె హావభావాలు ఎలా ఉంటాయో చెప్తూ దగ్గరుండి చేయిచారు అని తెలిపింది ప్రేమ. సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం.. షూటింగ్ లో పాము ఒక వ్యక్తిని నిజంగానే కాటువేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన అతన్ని బ్రతికించుకోలేకపోయాం అని తెలిపింది ప్రేమ.

ఇక ఈ సినిమా క్లామాక్స్ సమయంలోనూ చాలా ఇబ్బందిపడ్డం.. మంచులో షూటింగ్ చేశాం అని తెలిపింది ప్రేమ. సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పెద్దకష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ లో హిట్ అవుతుందని ఊహించలేదు అని తెలిపింది ప్రేమ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker