Health

ఈ కాలంలో ఈ జొన్న జావా తాగితే ఒంటికి బాగా చలవ చేస్తుంది.

ఎర్రటి ఎండలకు ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని చాలా మంది చెబుతారు. కానీ ఇంట్లో కూర్చుంటే పనులు ఎలా అయ్యేది. ఎంత ఎండలు కొట్టినా తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిందే అనుకుంటే జాగ్రత్తలు పాటించడం తప్ప చేయాల్సిందేముంటుంది. అయితే అంబలి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడంటే తక్కువే గానీ.. ఒకప్పుడు వేసవి వస్తే చాలు అమ్మమ్మలు.. జొన్న అంబలి తయారుచేసేవారు. కుండలో తయారు చేసి.. తాగుతుంటే.. అమృతంలా అనిపించేది.

ఆరోగ్యానికి కూడా మంచిది. వేసవిలో కొన్ని గ్రామాల్లో ప్రజలు అంబలి తయారు చేసుకుని తాగుతుంటారు. అంతేకాదు.. అన్నంలో కూడా కలుపుకొని తింటారు. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నలతో చేసే అంబలికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిరు ధాన్యాల్లో ఒకటైన జొన్నలతో చేసిన అంబలి తీసుకుంటే.. వేసవిలో కడుపు చల్లగా ఉంటుంది. జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే.. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. జొన్నల్లో క్యాల్షియం, ఐరన్ వంటి వాటితో పాటుగా పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

అనేక మంది జొన్నలతో తయారు చేసే రొట్టెలు తింటారు. అయితే అవే కాకుండా.. జొన్న అంబలిని తీసుకుంటే.. ఎంతో మంచిది. అంబలి తాగితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం. తయారు చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి. మెుదట ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. తర్వాత అందులో మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. ఉండలు లేకుండా కలపాలి. ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెను తీసి.. స్టవ్ మీద పెట్టి.. మంటపై కలుపుతూ ఉడిగించాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చేయాలి.

తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక గ్లాసులోకి తీసుకుని అందులో మిరియాల పొడి, నిమ్మరసం వేసుకోవాలి. ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉండే జొన్న అంబలి రెడీ అవుతుంది. జొన్న అంబలితో మన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. అంబలి తాగితే.. నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు బలంగా తయారు అవుతాయి. రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. అంబలి తీసుకుంటే.. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. మలబద్ధకంలాంటి సమస్యలు క్లీయర్ అవుతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవాలనుకునేవారికి అంబలి మంచి ఔషధం. అంబలి తాగితే.. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కండరాలు కూడా ధృడంగా ఉంటాయి. బాడీ మెయింటేన్ చేయాలని వ్యాయామాలు చేసే వారికి అంబలి బెస్ట్ ఆప్షన్. శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ విధంగా జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎవరైనా తాగొచ్చు. నేరుగా అయినా తీసుకోవచ్చు. లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. జొన్న అంబలి తీసుకుంటే.. బలంగా తయారవుతారు. పిల్లలకు కూడా ఇది అలవాటు చేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker