News

ఆ ఆస్తి కోసం జూ.ఎన్టీఆర్ ని దారుణంగా మోసం చేసిన మహిళ. వెలుగులోకి షాకింగ్ విషయాలు.

2003లో సుంకు గీత అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ లో 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. ఆ స్థలంలోనే తన డ్రీం హౌస్ ని కట్టుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ స్థలం, అందులో నిర్మించిన ఇంటి ఖరీదు కొన్ని కోట్లల్లో ఉంటుంది. అలాంటిది ఆ ఇంటి స్థలం ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ స్థలాన్ని అమ్మిన సుంకు గీత.. 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే పూర్తీ వివరాలోకి వెళ్తే ఇప్పటి నుంచే తారక్ ఆస్తులు కొనడం, డబ్బు సేవ్ చేసుకోవడం, పిల్లల కోసం డబ్బు కేటాయించడం లాంటివి చేస్తున్నారు.

ఆ మధ్యన తారక్ హైదరాబాద్ శివారు ప్రాంతం శంకర్ పల్లిలో 6 ఎకరాల విలువైన ఫామ్ హౌస్ కొనుగోలు చేశాడు. ఆది చిత్రంలో ఎన్టీఆర్ 2002లోనే స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచే ఆస్తులు కొనడం తారక్ ప్రారంభించాడట. 2003లో ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ స్థలం తీవ్ర వివాదం గా మారింది. ఆస్తి వివాదం తలెత్తడంతో ఎన్టీఆర్ హై కోర్టుని ఆశ్రయించాడు.

పూర్తి వివరాలని గమనిస్తే.. సంకు గీతా అనే మహిళ నుంచి ఎన్టీఆర్ 680 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. చట్ట ప్రకారం అనుమతి తీసుకుని గత ఏడాది నుంచి తారక్ ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పలు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఆ మహిళ ఎన్టీఆర్ కి ఫేక్ డాక్యుమెంట్స్ తో స్థలం అమ్మినట్లు తెలుస్తోంది. తాను కేవలం ఒక్క బ్యాంకులోనే రుణం తీసుకుని 1996లో ఈ స్థలాన్ని కొన్నట్లు తారక్ కి చెప్పింది.

కానీ సంచలన విషయం ఏంటంటే ఆమె ఈ స్థలాన్ని షూరిటీ గా పెట్టి బ్యాన్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్,ఎస్బిఐ ఇలా పలు బ్యాంకుల్లో ఆమె రుణాలు తీసుకుందట. ఆ రుణం తీరకపోవడంతో ఈ బ్యాంకులన్నీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించాయి. దీనితో ట్రిబ్యునల్ ఆ స్థలాన్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు అని అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు బ్యాంకులు రంగంలోకి దిగడంతో ఎన్టీఆర్.. సంకు గీతపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అంతే కాదు బ్యాంకులు తన స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండా తారక్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హై కోర్టు కేసు విచారణని జూన్ 6 కి పోస్ట్ పోన్ చేసింది. జూన్ 3 లోగా స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని కోర్టుకి అందజేయాలని జడ్జీలు పేర్కొన్నారు. మొత్తంగా కోట్ల రూపాయలతో కొన్న స్థలం ఎన్టీఆర్ కి ఊహించని సమస్యగా మారింది. అబద్దాలతో, ఫేక్ డాక్యుమెంట్స్ తో తారక్ కి స్థలం అమ్మిన సంకు గీతకి చట్టం బుద్ది చెప్పాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker