Uncategorized

ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ డైరెక్టర్ మృతితో షాక్ లో చిరంజీవి.

చిరంజీవితో ప్రాణం ఖరీదు వంటి అనేక చిత్రాలను రూపొందించిన దర్శకుడు కె వాసు తాజాగా తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. దర్శకుడి మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు.

గత కొన్ని ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలలుగా ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూనే వాసు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా వాసుకు మంచి గుర్తింపు ఉంది.

కె. వాసు.. 1951, జనవరి 15 న జన్మించారు. ఆయన తండ్రి కె.ప్రత్యగాత్మ కూడా దర్శకులే. చిన్నతనం నుంచి దర్శకత్వం పై మక్కువ పెంచుకున్న వాసు.. తన తండ్రి ప్రత్యగాత్మ వద్ద ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఆ తరువాత ఆడపిల్లల తండ్రి అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు. 22యేళ్ల పిన్నవయసులోనే దర్శకత్వం వహించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి హీరోగా పెట్టి ప్రాణం ఖరీదు అనే సినిమాను తెరకెక్కించాడు. చిరు మొదటి సినిమా పునాది రాళ్లు అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు అనే చెప్పాలి.

ఈ చిత్రం చిరుకు, ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత చిరుతో కలిసి ఆయన ఆరని మంటలు, కోతల రాయుడు, అల్లుళ్ళొస్తున్నారు లాంటి సినిమాలు చేశారు. ఇక చివరగా వాసు దర్శకత్వం వహించిన చిత్రం గజిబిజి. కాగా, వాసు మృతి వార్త విన్న ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker