Health

ఈ రసాన్ని రోజు కొంచం కొంచం తాగితే కొన్ని రోజుల్లోనే మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.

డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం , మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. అయితే చాలామంది కాకరకాయ పేరు చెప్పగానే ముఖం అదోలా పెడతారు. కాకరకాయతో చేసిన ఏ వంటకాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు ఇతర ఏ కూరగాయ చేయదు. మన శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి కాకరకాయకు ఉంది. కాకర రసం తాగితే ఎంతో ఆరోగ్యం.

అలాగే కాకరకాయతో పులుసు చేసుకొని తిన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగంతో బాధపడేవారు కాకరకాయకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కాకరకాయతో చేసిన వంటకాలను తినాలి. ముఖ్యంగా ప్రతిరోజు కాకరకాయ రసాన్ని తాగితే ఎంతటి మధుమేహం అయినా అదుపులోకి వచ్చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడం వల్లే మధుమేహం వచ్చిందని చెబుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టే ఆహారాన్ని ఎంచుకొని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ గుణం కాకరకాయలో అధికం. వీటిల్లో చెరాటిన్ అనే పదార్థం ఉంటుంది.

ఇది రక్తంలో కలిసి చక్కెర పెరగకుండా అడ్డుకుంటుంది. ఎన్నో అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రక్తంలోని చక్కెర, గ్లూకోజ్‌ను.. జీవక్రియలో భాగం చేస్తుంది. అవి జీవక్రియలో పాల్గొన్నప్పుడు గైకోజన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఈ గైకోజన్ కాలేయంలోనే నిల్వ ఉంటుంది. ఇది శక్తి విడుదలయ్యేలా చేస్తుంది. ఈ గైకోజన్ విడుదల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో పెరగకుండా ఉంటాయి. కాకరకాయలో మరెన్నో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సీ భారీగా ఉంటాయి.

ఆరోగ్యపరమైన కొవ్వులు, ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి కాకరకాయను ఎవరు తిన్నా ఆరోగ్యమే. దాని రుచి అంతగా బాగోదు. రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కాకరను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజూ చిన్న గ్లాస్ తో కాకరకాయ రసాన్ని తాగితే మధుమేహ రోగులు ఉపశమనం పొందుతారు. ఎంతటి మధుమేహం అయినా ఈ రసం తాగడం వల్ల అదుపులోకి వచ్చేస్తుంది. రెండు వారాలు తాగి చూడండి. మీకే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

కాబట్టి రోజుకు చిన్న గ్లాస్ తో కాకరకాయ రసం తాగడం అలవాటు చేసుకోండి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు అంటే షుగర్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు మాత్రం పరగడుపున ఖాళీ పొట్టతో కాకరకాయ రసాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇది మరింతగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల నీరసంగా అనిపించవచ్చు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకరకాయ రసాన్ని ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker