Health

అమ్మాయిలు వెండి పట్టీలు ధరిస్తే ఆ నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి.

కాళ్లలో తచుగా వచ్చే నొప్పులను, తిమ్మిరి, వణుకు వంటి సమస్యలన్నింటినీ పట్టీలతో చెక్ పెట్టొచ్చు. అవును వెండి పట్టీలు పెట్టుకున్న వారికి కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలు చాలా తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిజానికి వెండి పట్టీలు, వెండి మెట్టెలు ధరించడం భారతీయ సంప్రదాయాల్లో భాగమే కాదు, అది ఆడపిల్లలకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వెండి శరీరానికి తగ్గట్టు ప్రతిస్పందించే ఒక లోహం. వెండి అనేది సానుకూల శక్తిని శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అమ్మాయిలలో హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

మెరుగైన రక్తప్రసరణ కోసం వెండి మన శరీరాన్ని తాకుతూ ఉండడం అవసరమని చెబుతారు అధ్యయనకర్తలు. అలాగే కొంతమంది ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో నొప్పులు వస్తాయి. వాటిని తగ్గించేందుకు కూడా వెండి పట్టీలు సహాయం చేస్తాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. రుతునొప్పితో బాధపడుతున్న స్త్రీలు వెండి పట్టీలు, వెండి మట్టెలు, వెండి వస్తువులు ధరించడం వల్ల ఆ నొప్పి కాస్త తగ్గుతుందని వివరిస్తున్నారు. పూర్వం అధికంగా వెండి నగలను ఉపయోగించేవారు.

మొహంజదారో వంటి పురాతన నాగరికతలలో కూడా వెండి నగలు ఎన్నో బయటపడ్డాయి. అప్పట్లో ఒంటినిండా వెండి నగలతోనే ఎక్కువ మంది తయారయ్యేవారు. వెండి అనేది ఒక విద్యుత్ వాహకం అని చెప్పుకోవాలి. ఈ లోహానికి నిర్దిష్ట లక్షణాలు ఉంటాయి. మానవ శరీరంపై ఇది సానుకూల ప్రయోజనాలను చూపిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ మైక్రో బయల్ ఏజెంట్. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడా శరీరానికి ఇస్తుంది.

శరీరంపై అయిన గాయాలు నయం అయ్యేందుకు కూడా సహకరిస్తుంది. వెండి శరీరంలోని వేడిని నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే రక్తప్రసరణకు సహాయపడుతుంది. వెండితో ఎన్నో వైద్య పరికరాలను కూడా తయారు చేశారు. విషపూరితమైన పదార్థాలను గుర్తించడానికి ఇది మనకు సహకరిస్తుంది. విషపూరిత పదార్థాలు దీనికి తాకగానే తన రంగును మార్చుకుంటుంది. సౌతాంఫ్టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థరైటిస్ చేతులకు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని,

అలాగే ఆర్థరైటిస్ వచ్చాక వెండి వస్తువులు ధరించడం వల్ల దాని లక్షణాలను తగ్గించుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు వెండి స్ప్లింట్లను ధరించడం వల్ల నొప్పి తగ్గుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. వెండి ఆభరణాలను ధరించడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధ్యానం, యోగా వంటి వాటిపై మనసు మళ్లుతుంది. కాబట్టి వెండి వస్తువులకు ఎక్కువ విలువ ఇవ్వండి. వీలైనంతవరకు వెండి వస్తువులు ధరించేందుకు ప్రయత్నించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker