కళ్ల కలక ఉన్నవారిని చూస్తే మనకూ వస్తుందా..? అసలు విషయం ఇదే.

వాతావరణంలో మార్పులు సంభవించడంతో వస్తున్నది. ఇదీ ప్రధానంగా వైరస్, బ్యాక్టీరియా,అలర్జీ కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అడెనో వైరస్ కారణంగా వస్తుండగా.. స్కూళ్లు, హాస్టళ్లు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో అధికమవుతున్నది. వైరస్, బ్యాక్టిరియా ద్వారా వస్తే చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలర్జీ ద్వారా వస్తే తేలికగా తగ్గిపోతుందని వైద్యులు తెలుపుతున్నారు.
అయితే ఒక కన్ను ఎర్రబడడం లేదా.. రెండు కళ్లు ఎర్రగా మారడం.. కళ్లలో మంట నొప్పి లేక దురద .. కనెరెప్పలు వాపు రావడం, కంటి రెప్పలు అతుక్కోవడం.. ఎక్కువగా వెలుగులు చూడలేకపోతవడం లాంటి లక్షణాలు ఉంటే కళ్లకలక అని అర్థం. ఇలాంటి లక్షణాలు కనిపించిప్పుడు కళ్లను నలపడం లేదా కంట్లో చేతులు పెట్టడం కానీ చేయకూడదు.
శుభ్రమైన కర్చీప్ లేదా టిష్యూ పేపర్ తో కళ్లను తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా లక్షణాల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. ఈ వైరస్ ఒకటి, రెండు వారాల్లో తగ్గిపోతుంది. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకకుండా ఉండడానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. తరుచూ కళ్లను ముట్టుకోవడం మానేయాలి. ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరకుండా ఉండాలి.
కళ్ల కలక ఉన్నవారు వాడిన కర్చీఫ్, లేదా చెద్దర్లు ఇతరులు వాడకుండా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్ కు పంపకుండా ఉండడమే మంచిది. సొంత వైద్యంతో ఆలస్యం చేయకుండా వైద్యడు వద్దకు వెళ్లి సలహా తీసుకోవడం మంచింది. కళ్ల కలక వచ్చిన వారి కంట్లో చూడగానే ఇతరులకు సోకుతుందని అనేది అబద్ధం.
ఇది బ్యాక్టీరియా. దీంతో కళ్ల కలక వచ్చిన వారు వాడిన వస్తువులను తాకిన వారికి మాత్రమే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందువల్ల కళ్లలోకి చూడడం ద్వారా వస్తుందనేది ఏమాత్రం నిజం కాదని అంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా కళ్లకలక వచ్చిన వారు గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెబుతున్నారు.