Health

కూల్ డ్రింక్స్ కన్నా గంజి నీరు తాగడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాగంటే..?

మన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలకైనా సులభమైన, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో ఆయుర్వేదం ఎల్లప్పుడూ మన రక్షణ కవచంగా నిలిచింది. ఈ పురాతన వైద్య శాస్త్రం, మన చుట్టూ పెరిగే మొక్కలు, మన వంటగదిలో లభించే పదార్థాలతోనే అద్భుత చికిత్సలను అందించింది. అయితే ఇప్పుడున్న వారు ఆరోగ్యకరమైన ఆహారం కంటే రుచికరమైనదాని కోసం వెతుకుతున్నారు.

దీంతో అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. టేస్టీ ఫుడ్ పేరుతో జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతున్నారు. అయితే బరువు పెరగకుండా ఉండాలంటే గంజిని తీసుకోవాలని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు రెగ్యులర్ గా గంజి తాగితే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బియ్యంతో తీసిన గంజిని మాత్రమే కాకుండా తృణ ధాన్యాలతో తయారు చేసిన జావాలాంటిది తీసుకోవడం మరీ మంచిదని అంటున్నారు.

ఇలా తీసుకున్న వారు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గంజిలో బీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫైబర్ ను కలిగి ఉంటుంది. గంజిలో ఉప్పు, నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల కడుపు నిండినట్లు అవుతుంది. దీంతో బలమైన ఆహారంగా తయారై ఎముకలు పటిష్టంగా మారుతాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు గంజి మంచి ఔషధంలా పనిచేస్తుంది.

ప్రతి రోజు గంజి తాగడం వల్ల ఎనర్జీగా ఉంటారు. అందు చేత కూల్ డ్రింక్స్ కు బదులు గంజిని తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. గంజి ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అమ్ముతారు? అనే ప్రశ్న కొందరికి ఎదురవుతుంది. గంజి కావాలనుకునేవారు బియ్యంలో కాస్త నీళ్లు ఎక్కువగా కలపాలి. అన్నం కొంచెం ఉడికిటన్లు అవగానే అందులోనే గంజిని ఒక పాత్రలో తీసుకోవాలి.

ఇది టేస్టీగా ఉండకపోవచ్చు. ఇందులో కాస్త ఉప్పుతో పాటు నిమ్మరసం వేయడం వల్ల మంచి టేస్టీగా మారుతుంది. ప్రతీ ఉదయం దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker