Health

కళ్ల కలకని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

కళ్ల కలక కేసులు ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు వల్ల రావచ్చు. కళ్లు ఎరుపెక్కడం, దురద, కను రెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే గనక కళ్ల నుంచి నలక ఎక్కువగా రావొచ్చు. అయితే సాధారణ బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఇది సోకుతూ ఉంటుంది. జలుబు కారకమైన వైరస్ తో కూడా కండ్లకలక వస్తుంది వర్షాకాలం అవడం వలన వాతావరణ పరిస్థితులు కారణంగా ఇన్ఫెక్షన్లు సోకి కలక వస్తుంది.

గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకి కారణం అవుతోందని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక ఇప్పుడు కండ్లకలక యొక్క లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలని కూడా చూసేద్దాము.. కండ్ల కలక యొక్క లక్షణాలు.. ఎరుపు, గులాబీ రంగు లోకి తెల్లగుడ్డు రావడం కండ్ల కలక యొక్క లక్షణమే.

కంటి రెప్పలు వాపు, ఉబ్బడం కూడా కలక యొక్క లక్షణమే. కంటి నొప్పి దురద, మంట కలగడం కూడా దీనికి లక్షణం. కంటి నుంచి నీళ్లు కారడమూ దీనికి లక్షణమే. కంటి నుంచి పూసులు రావడం కూడా దీనికి లక్షణమే. నిద్రించినప్పుడు కంటి రెప్పలు అంటుకుంటాయి. అలానే కాంతిని చూడకపోవటం కూడా దీనికి లక్షణమే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..ఈ సమస్య రాకూడదంటే ఇతరుల టవల్స్, దిండు కవర్లు, మేకప్ వస్తువులు వంటివి వద్దు.

దీని వలన ఈ సమస్య సులభంగా వ్యాపిస్తుంది. ఎవరికైనా కండ్లకలక ఉంటే వాళ్లకి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు ముట్టుకోకూడదు. వెంటనే చికిత్స చేయకపోతే ఇది మరింత ప్రమాదం. కనుక వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. ట్రీట్మెంట్.. కంటి వైప్స్ తో కళ్ళను క్లీన్ చేసుకోండి. కళ్ళని పదేపదే రుద్దకండి.

కంటికి రక్షణగా కళ్ళజోడు వంటివి పెట్టుకోండి. కాంటాక్ట్ లెన్స్ ని ఉపయోగించకండి. సొంతంగా మందులు వేసుకోవడం, ఇంటి చిట్కాలని పాటించడం వద్దు. ఏదైనా డ్రాప్స్ వేసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కళ్ళు సరిగ్గా కనబడకపోయినట్లయితే వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker