News

15 ఏళ్ల వయస్సులో పారిపోయి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి, ఇప్పడు ఏకంగా..?

చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్వరలోనే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో వాటికి తెరపడి ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే సినిమాల్లో నటించేందుకు ఎందరో నటీనటులు ఊరు విడిచి పారిపోయిన కథలు మనం విన్నాం. అయితే సినిమా కోసం ఊరు విడిచి పారిపోయిన ఓ నటి కథ విన్నారా…ఇప్పుడు మనం ఆమె గురించే చూడబోతున్నాం.

చదువు మధ్యలోనే మానేసి, 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి, ఉండేందుకు చోటు లేకుండా ప్లాట్‌ఫాంపై జీవించిన ఆ బాలిక నేడు లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. అంతే కాదు పార్లమెంట్లో కూడా అడుగుపెట్టబోతోంది. ఆమె మరెవరో కాదు నటి కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని బాంబియా పట్టణంలో కంగనా రాజ్ పుత్ ల ప్యామిలీలో జన్మించింది. ఆమె తల్లి ఆశా పాఠశాల ఉపాధ్యాయురాలు మరియు అతని తండ్రి అమర్‌దీప్ వ్యాపారవేత్త. కంగనాకు ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు.

కంగనాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక. అయితే దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక సినిమా మీద ప్రేమతో.. ఎలాగైనా ఎదగాలని కంగనా 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ముంబైకి పారిపోయింది. ఇక్కడ ఉండేందుకు స్థలం దొరక్కపోవడంతో ఫ్లాట్ ఫారం ఇబ్బందిపడుతూ నిద్రపోయింది.. అలా చిన్న చిన్న పనులు చేస్తూ.. జాగ్రత్తగా తనను తాను కాపాడుకుంటూ.. ఎట్టకేళకు.. 19 ఏళ్ల వయసులో కంగనాకు ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ చిత్రంతో కంగనా తెరంగేట్రం చేసింది. సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.ఆ తర్వాత ప్యాషన్ సినిమా కంగనాకు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. తర్వాత విభిన్నమైన కథాంశాలున్న సినిమాల్లో నటించడం ప్రారంభించిన కంగనా క్వీన్, మణికర్ణిక, తను వెట్స్ మను వంటి సినిమాల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ సినిమాలన్నీ ఆమె హీరోగా నటించిన సినిమాలే.. అంతే కాదు టాలీవుడ్ లో ఆమె నటించిన ఏక నిరంజన్ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆమెను బాలీవుడ్ దూరం పెట్టినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని నటిగా ఎదిగింది. అటు రాజకీయాల్లోకూడా తనదైన ముద్ర వేసిన కంగనా.. బీజేపీకి సపోర్ట్ గా నిలబడింది. అంతే కాదు.. బీజేపీ నుంచి తాజాగా జరిగినఎలక్షన్స్ లో పోటీ చేసింది హీరోయిన్ హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసింది కంగనా.. ఘన విజయం కూడా సాధించింది. నటిగానే కాకుండా మాస్ హిట్ మణికర్ణికతో దర్శకురాలిగా కూడా అడుగుపెట్టింది కంగనా. ప్రస్తుతం ఆమె తన సొంత దర్శకత్వంలో ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తోంది. ఈమూవీలో ఆమె ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker