News

ఆ హీరోయిన్ అంటే నా భర్తకు చాలా ఇష్టం అంటూ అసలు విషయం చెప్పిన కాజల్.

మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ కాజల్ మాత్రమే. ఆ రికార్డును ఇప్పటివరకు ఏ హీరోయిన్ బ్రేక్ చేయలేదు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కరోనా లాక్ డౌన్ సమయంలో కాజల్ వివాహం చేసుకుంది. వీరికి 2022 ఏప్రిల్ 19న నీల్ అనే మగబిడ్డ పుట్టాడు అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ అనే లేడి ఓరియెటెండ్ మూవీలో నటించింది. కాగా, ఈ మూవీకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు.

అయితే ఈ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో కాజల్ వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ తో బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తరుచు ఏదో ఒక ప్రమోషన్స్ లో పాల్గొని నెట్టింట ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కాజల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల మాట్లాడుతూ..

‘తన నీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్‌ కిచ్లూనే కారణమని చెప్పుకొచ్చింది. అలాగే తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని వెల్లడించింది. ఇకపోతే గౌతమ్ తనని చాలా బాగా సపోర్ట్‌ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తున్నని’ చెప్పుకొచ్చింది. ‘ఇక సినిమాల ఎంపిక విషయంలో అతను ఏమాత్రం జోక్యం చేసుకోడు. కానీ, కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడటని కాజల్ తెలిపింది. అంతేకాకుండా..

ఖాలీ సమయం దొరికితే గౌతమ్ తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారని, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని’ కాజల్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ తన భర్త గౌతమ్ క్లిచ్ గురించి చేసిన ఆసక్తర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ గురించి చెప్పుకొచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker