News

డబ్బులు కోసం అలాంటి సినిమాలు చేసానని ఒప్పుకున్న స్టార్ నటుడు.

పంచాయత్ వెబ్ సిరీస్‍‍లో తొలి రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. దాంతో మూడో సిరీస్‍కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. దాంతో రెండేళ్ల గ్యాప్ తర్వాత పంచాయత్ మూడో సీజన్ కు ఓ రేంజి రెస్పాన్స్ వస్తోంది. భారీ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. అంచాలను నిలబెట్టుకుంటూ అనుకున్నట్టే పంచాయత్ సీజన్ 3 కూడా సక్సెస్ అయింది. ఈ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

అయితే దుర్గేశ్ కుమార్.. బీహార్ కు చెందిన ఇతడు 2001లో ఇంజినీరింగ్ చేయడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ చదువు కష్టంగా ఉండటంతో.. నటనవైపు అడుగులు వేశాడు. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే.. డిగ్రీ పూర్తి చేశాడు. నేషనల్ డ్రామా స్కూల్ లో యాక్టింగ్ కోర్స్ కూడా చేశాడు. ఆ తర్వాత ‘హైవే’ మూవీలో అవకాశం రావడంతో.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. సుల్తాన్, ఫ్రీకీ అలీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ మూడు సినిమాల్లో నటించినప్పటికీ.. అతడికి కష్టాలు తప్పలేదు.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ సినిమాల్లో నటించానని తొలిసారి చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దుర్గేశ్ కుమార్ మాట్లాడుతూ..”2016లో నేను ముంబైకి వచ్చాను. ఇక్కడ కొందరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. దాంతో మేమందరం గ్రూప్ గా మారి అవకాశాల కోసం తిరిగే వాళ్లం. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి.. అదిలేకుండా నేను బతకలేను. అందుకే వచ్చిన ప్రతీ సినిమా చేసుకుంటూ పోయాను. డబ్బుల కోసం కొన్ని అడల్ట్ మూవీస్ కూడా చేశాను.

హైవే, ఫ్రీకీ అలీ, సుల్తాన్ సినిమాల్లో నటించిన తర్వాత కూడా నేను అవకాశాల కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ల కాళ్ల మీద పడ్డాను. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కూడా ఆడిషన్స్ కు వెళ్తే ఏదోలా ఉంటుంది. కానీ ఏం చేస్తాం. అలా ‘పంచాయత్’ మెుదటి సీజన్ లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీన్ని షూట్ చేశారు” అని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చాడు ఈ నటుడు. డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశానని ఓ నటుడు చెప్పుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker