Health

నరాల సంబంధం ఇబ్బందులు, చర్మ వ్యాధులకు కర్పూరం మంచి ఔషదం.

ఇంటికి మంచి సువాసనను చేకూర్చే ద్రవ్యాల్లో కర్పూరం ఒకటి. దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో, ఒంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీలు మొత్తం సమసిపోతాయని చెబుతారు. అందుకనే భారతీయ ఇళ్లల్లో దాదాపుగా ప్రతి పూజా మందిరంలోనూ కర్పూరం ఉంటుంది. పూజలు, శుభ కార్యాల్లో దీన్ని తప్పకుండా వాడతారు. అయితే ఇది ఎలా తయారవుతుందనేది చాలా మందికి తెలియదు. కర్పూరం దేవుడికి హారతి ఇవ్వడానికే కాదు సుగంధ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు.

అంతే కాదు.. ఈ కర్పూరంవలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కర్పూరం బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్, కొన్నిరకరాల ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల్లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను కర్పూరం వాడతారు.

కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు.

జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. కర్పూరం పురుగుల మందులు, చెడువాసనల నిర్ములనకు, బట్టలను కొరికి తినే చెదపురుగులు, నిర్ములనకు ఉపయోగిస్తుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker