Health

పచ్చళ్లు ఎక్కువగా తినేవారికి గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా..?

ఏ ఆహారమైన సరే అతిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజుకు ఎంత పచ్చడి తీనాలో తెలుసుకోవాలి. అతిగా ప‌చ్చ‌డి తిన‌కూడ‌దు అంతేకాదు రోజూ ప‌చ్చ‌డి తీసుకోవ‌డం కూడా మంచిది కాదు. ముఖ్యంగా బీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు పచ్చళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే భారత దేశంలో పచ్చళ్లు తినే అలవాటు దాదాపుగా ప్రతి చోటా ఉంటుంది. దక్షిణాదిన ఈ అలవాటు మరీ ఎక్కువ. అందునా తెలుగు వారంటేనే పచ్చళ్లకు పెట్టింది పేరు. కొన్ని తెలుగు ఇళ్లల్లో అయితే పంచ భక్ష పరమాన్నాలు ఉన్నా సరే పచ్చడి ఉండాల్సిందే.

మొదటి ముద్ద దానితో తినాల్సిందే అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. పచ్చళ్ల వల్ల లాభాలు.. పచ్చడిని అచ్చ తెలుగులో ఊరగాయ అంటారు కదా. అంటే ఉప్పు వేసి ముక్కల్ని నిల్వ పెట్టి, దాన్ని తాలింపు పెట్టి తయారు చేస్తారు. దీనికి పెద్ద తయారీ తతంగమే ఉంటుంది. అయితే ఇలా ఊరబెట్టిన పచ్చళ్లలో ప్రోబయోటిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి బ్యాక్టీరియా అన్నమాట. అవి పచ్చళ్లను పాడు కాకుండా కాపాడతాయి.

అలాగే మన లోపలికి వెళ్లిన తర్వాత పేగులనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. తిన్న ఆహారంలోని పోషకాలను సవ్యంగా శరీరం శోషించుకోవడానికి సహకరిస్తాయి. పేగులు ఆరోగ్యంగా ఉంటే జీర్ణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మామిడి, ఉసిరి, నిమ్మ, అల్లం తదితర పచ్చళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌ని రానీయవు. ఇలా పచ్చళ్లు మన ఆరోగ్యంపై కొంత సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.

నష్టాలివే.. పచ్చళ్లను తయారు చేయడానికి ప్రధానంగా ముక్కలను ఉప్పు వేసి ఊరబెడతారు. కాబట్టి వీటిలో సోడియం శాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇవి నిల్వ ఉండటానికి కారం, అధికంగా నూనెల్లాంటి వాటినీ వాడతారు. ఇవన్నీ మనలో కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని పెంచుతాయి. దీని వల్ల రక్త పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె పోటు, గుండె జబ్బులు రావొచ్చు. అధికంగా పచ్చళ్లను తినడం వల్ల లివర్‌, కిడ్నీలకు ఒత్తిడి కలుగుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే అధిక సోడియం ఈ అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

ఈ రెండు అవయవాలకు సంబంధించిన అనారోగ్యాలు ఉన్న వారు కచ్చితంగా పచ్చళ్లకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఎక్కువ మోతాదులో సోడియం శరీరంలోకి చేరుకోవడం వల్ల గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపం ఉన్నప్పుడు పచ్చళ్ల రూపంలో ఉప్పును ఎక్కువగా లోపలికి తీసుకుంటే ఎముకలు మరింత బలహీనం అవుతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker