News

కవిత అరెస్టు ముందు కేటీఆర్ ఏం చేసాడో చుడండి. వీడియో వైరల్.

శుక్రవారం ఈడి అధికారులు ఆమెను అరెస్టు చేసి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్తున్న క్రమంలో.. కారు వద్దకు వెళ్లారు. కవితను అలా చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఒక చేత్తో కంట నీరును తుడుచుకుంటూనే.. మరో చేతితో తన సోదరికి ధైర్యం చెప్పారు..”నీకు నేనున్నా. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఢిల్లీ బయలుదేరిన వెంటనే.. నేను కూడా అక్కడికి వచ్చేస్తా. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నా.

ఏం కాదు.. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు” అంటూ కేటీఆర్ కవితను ఊరడించారు. అయితే కవిత ఇంటి వద్దకు వచ్చిన న్యాయవాదులతోపాటు, కేటీఆర్‌, హరీశ్‌రావును కూడా ఈడీ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపటి తర్వాత కవిత న్యాయవాదులను, కేటీఆర్‌, హరీశ్‌రావును లోనికి అనుమతించారు.

ఈ సందర్భంగా కవితను ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్టు చేయడంపై కేటీఆర్‌ అభ‍్యంతరం వ్యక్తం చేశారు. ఈవిషయమై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక కేటీఆర్‌ ఈడీ అధికారులను నిలదీయడంతో అధికారులు ఆ దృశ్యాలను వీడియో షూట్‌ చేయించారు. ఈ సందర్భంగా కూడా కేటీఆర్‌ కవిత అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ఈడీ అధికారులను ప్రశ్నించారు.

అరెస్టు చేయబోమని ఈడీ అధికారులు లిఖిత పూర్వకంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఈమేరకు లేఖను చూపించారు. బాధిత వ్యక్తి చట్టపరమైనపరిష్కారాన్ని ఆశ్రయించవచ్చని అధికారుతుల తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker