Health

కిడ్నీలో రాళ్లు ఉన్నాయ్ అని తెలిపే లక్షణాలు ఇవే.

శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. నేటి ఆధునిక జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య చాలా మందికి వస్తున్నది. దీంతో ఏం చేయాలో తెలియిక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

స్టోన్లు బాగా పెరిగే వ‌ర‌కు తెలియ‌కుండా ఉంటుండ‌డంతో స‌మ‌స్య ఆపరేష‌న్ వ‌ర‌కు దారి తీస్తున్నది. అయితే కిడ్నీ స్టోన్లను నిజానికి ఆరంభంలోనే గుర్తించ‌వ‌చ్చు. అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు లక్షణాలు, సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని గుర్తించి నిర్దారిస్తే.. కిడ్నీ స్టోన్‌లను ఆరంభంలోనే తొల‌గించుకోవ‌డం చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. మ‌రి కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని తెలిపేందుకు మ‌న శ‌రీరంలో ఎలాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..

కిడ్నీ స్టోన్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ ప‌క్కన నొప్పి వ‌స్తుంటుంది. లేదా ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు పొడిచిన‌ట్లుగా వ‌స్తుంది. దాన్ని గ‌మ‌నిస్తే కిడ్నీ స్టోన్లు ఉన్నాయో, లేవో చెప్పవచ్చు. ఆ నొప్పి గ‌న‌క వ‌స్తుంటే డాక్టర్‌ను క‌ల‌సి వైద్య పరీక్షలు చేయించాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఉంటే తెలిసిపోతుంది. ఆ మేర‌కు చికిత్స తీసుకుంటే వెంట‌నే రాళ్లను తొల‌గించుకోవ‌చ్చు. మూత్రం పోసే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీ స్టోన్లు ఉన్నట్లేనని గ‌మ‌నించాలి.

షుగ‌ర్ వ‌చ్చిన వారికే కాదు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి కూడా త‌ర‌చూ మూత్రం వ‌స్తుంటుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తారు. కిడ్నీ స్టోన్లు ఉన్నవారి మూత్రం ర‌క్తం రంగులో ఉంటుంది. లేదా కొన్ని సార్లు రక్తం కూడా ప‌డ‌వ‌చ్చు. అలాగే మూత్రం దుర్వాస‌న క‌లిగి ఉంటుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి మూత్రం ఒకేసారి రాదు. ఆగి ఆగి వ‌స్తుంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారం, వ‌ణ‌క‌డం, జ్వరం రావ‌డం వంటి లక్షణాలు ఉంటే.. కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. ఆ మేర‌కు డాక్టర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి..!

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker