ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్. ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ లు కార్సినోమాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను కలిగి ఉన్న న్యుమోనెక్టమీ నమూనా ఈ క్యాన్సర్లలో అధిక భాగం దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి. 10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు. అయితే ఏ ఆహారము కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నయం చేయలేదు.
కానీ విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల వ్యాధితో పోరాడటానికి మీకు కొంతవరకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, ఎర్ర మాంసం అన్నీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రోకలీని రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం కొంత వరకు తగ్గుతుందని చెబుతున్నారు. బ్రోకలీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్రోకలీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. టమోటాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
టమాటాల్లో ఉండే ‘లైకోపీన్’ క్యాన్సర్ ముప్పును తప్పిస్తుంది. టమోటాల్లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. టమోటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను మోతాదులో రోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్, బీటా క్రిప్టోశాంథిన్, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పుసుపు లేని కూరలు ఉండవు. ఈ పసుపులో ఉండే కర్కుమిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉల్లిపాయలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధించగలవని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అల్లం.. అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి.
వీటిలో ఉండే పదార్థాలు శ్వాసనాళ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ బెర్రీస్ వంటి బెర్రీస్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో లక్షణాలుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ బెర్రీలు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్ రూట్ లో నైట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ శరీర మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.