కారం ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?
కారం తీసుకోవడం ఎక్కువయ్యేకొద్దీ గొంతు ఇంకా అలాగే కడుపులో మంటతో పాటు పలు ఆకస్మిక వ్యాధలు కూడా వెంటాడే అవకాశం చాలా ఎక్కువగా వుంది.కారం ఎక్కువగా తినడం వల్ల కొందరికి విపరీతమైన గ్యాస్ వస్తే, ఇంకొందరికి మాత్రం అజీర్తి ఎక్కువగా మొదలవుతుంది. అయితే ఇండియాను సుగంద ద్రవ్యాల భూమి అని పిలిస్తుంటారు. సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి మంచివే అయినా..
మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక చాలా మంది కారం పొడిని ఎక్కువగా తింటుంటారు. కారం బరువును తగ్గించేదైనా.. మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎండుమిరపకాయలను పోపుల్లో.. ఎండు మిరప పొడిని కూరల్లో వేస్తుంటారు. కారం పొడితోనే కూరలు ఎంతో టేస్టీగా అవుతాయి. అందుకే కొంతమంది మోతాదుకు మించి వినియోగించే వారు చాలా మందే ఉన్నారు.
కానీ ఇలా కారం ఎక్కువగా తినడం వల్ల ఎన్నో రోగాల బారిన పడతారు. డయేరియా..ఎర్ర మిరపపొడిని ఎక్కువగా తింటే డయేరియా బారిన పడే అవకాశం ఉంది. కారం పొడి వల్ల కడుపు దెబ్బతింటుంది. ఈ కారం పొడి పొట్టలోపల అత్తుకుని కూడా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కారం ఎక్కువగా తింటే విపరీతంగా విరేచనాలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఒంట్లో శక్తి అంతా పోతుంది. ఎసిడిటీ.. ఎండు మిరపపొడిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
ఇది కాస్త ఎసిడిటీకి దారితీస్తుంది. ఇక కొంతమందికైతే కారం ఎక్కువగా తింటే గుండెలో మంట కలుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే కూరల్లో కారం తగ్గించండి. కడుపులో పుండు.. నిజానికి కారం మోతాదులో తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అదే మోతాదుకు మించి తింటే కడుపులో పుండు అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు ఈ కారం పేగులకు, కడుపునకు అత్తుకుని అల్సర్ కు దారితీస్తుంది. అందుకే కారాన్ని ఎక్కువగా తినకండి.