News

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మీ కరెంటు బిల్లు సగానికి తగ్గిపోతుంది.

వేడి, ఉక్కపోతతో జనం చుక్కలు చూస్తున్నారు. ఈ సమయంలో బడ్జెట్ సహకరించినా, సహరించకపోయినా.. ఎలాగోలా కూలర్లు తెచ్చుకుంటున్నారు. ఏసీలు ఫిట్ చేయిస్తున్నారు. ఇక ఫ్రిజ్ లేకపోతే ఎండాకాలంలో చాలా కష్టం. ఇవన్నీ వాడుతుంటే.. కరెంట్ బిల్లు షాక్ కొడుతుంది. రెండు, మూడు నెలల్లో వచ్చే బిల్లు.. ఒక్క నెలలోనే వస్తుంది. అయితే, వీటిని వాడుతూ కూడా కరెంటు బిల్లు తక్కువగా వచ్చేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. యూనిట్లు పెరిగితే శ్లాబు రేటు మారిపోతుంది.

కరెంట్ బిల్ డబుల్ అవుతుంది. ఏసీ వాడటం కూడా ఒక ఆర్ట్ అండోయ్. ఏసీ పాయింట్లు బాగా తగ్గిస్తే, ఇల్లు త్వరగా కూల్ అవుతుందని భావిస్తుంటారు. కానీ ఏసీ పాయింట్లను ఇలా మరీ తగ్గించకూడదంటున్నారు నిపుణులు. ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్యే ఉంచితే.. లోడ్ భారం అదుపులో ఉంటుందట. ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుందని పక్కాగా చెప్పేస్తున్నారు. ఇక ఏసీ ఉన్న రూమ్‌లో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవడం మరో మధ్య. బీరువా వంటి ఇనుప వస్తువులు ఏవి ఉన్నా అవి చల్లదనాన్ని గ్రహించడం వల్ల..

రూమ్‌ కూల్ అవ్వడం లేట్ అవుతుంది. అలాగే సూర్యకిరణాలు ఏసీ ఉన్న రూమ్‌లోకి రాకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి తలుపులు, డోర్లు క్లోజ్ చేసి ఉంచండి. సోలార్ ప్యానెల్ – సౌర శక్తిని విద్యుత్ మార్చడానికి సౌర ఫలకాలను ఉపయోగిస్తారు. ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చడంలో సోలార్ ప్యానెల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఎనర్జీ సేవింగ్ లైట్ – ఎనర్జీ సేవింగ్ లైట్లు తక్కువ మొత్తంలో విద్యుత్ శక్తిని ఉపయోగించే బల్బులు. ఈ బల్బులను ఉపయోగించడం ద్వారా మీరు విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించవచ్చు. దీంతో పవర్ బిల్లు మీకు చాలా తక్కువగా వస్తుంది.

స్మార్ట్ ప్లగ్‌లు – ఇంటిలోని ఎలక్ట్రికల్ ఉపకరణాలను సులభంగా ఆన్ లేదా ఆఫ్ చేయడానికి స్మార్ట్ ప్లగ్‌లను ఉపయోగిస్తారు. వీటిని స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర స్మార్ట్ పరికరం ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా టైమర్‌ని సెట్ చేయడం ద్వారా వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దీనితో మీరు విద్యుత్తును ఆదా చేయవచ్చు. మరోవైపు పవర్ కట్ స్విచ్‌లను ఉపయోగించడం ద్వారా కూడా విద్యుత్తు బిల్లును తగ్గించుకోవచ్చు. స్మార్ట్ థర్మోస్టాట్ – విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ థర్మోస్టాట్‌లు చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిని మీ స్మార్ట్‌ఫోన్ నుండి కూడా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా మీ ఇంటి ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించవచ్చు. ఇది ఎయిర్ కండీషనర్ కోసం కూడా ఉపయోగించబడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker