News

హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగచైతన్య, మరోసారి ప్రేమలో పడిన చైతు.

కొంతకాలం క్రితం, శోభిత నాగ్‌పూర్‌లోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా నాగ చైతన్య కూడా అడవి బ్యాక్ గ్రౌండ్లో ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారనే అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు వీరిద్దరు పోస్ట్ చేసిన ఫోటోల్లో డీటెల్స్ పట్టుకుని.. నెట్టింట పెడుతున్నారు. అయితే అక్కినేని యువ హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలిసి తమ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారనే పుకారు ఉంది. తాజాగా నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను పంచుకున్నాడు. జీపులో కూర్చొని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అతను తెల్లటి టీ షర్ట్, డెనిమ్ ధరించిన లుక్‌లో వావ్ అనిపిస్తున్నాడు. ఇక మరోవైపు శోభిత కూడా అదే లొకేషన్‌లో క్లిక్ చేసిన ఫోటోలు, వీడియోలను వరుసగా షేర్ చేసింది. ఆసక్తికరంగా, శోభితా ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో చిత్రాలను పంచుకున్న ఒక రోజు తర్వాత నాగ చైతన్య పంచుకున్నారు.

అయితే శోభిత షేర్ చేసిన చిత్రాలలో జీప్, సూర్యాస్తమయం ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలను చూస్తే.. నాగ చైతన్య, శోభిత కలిసి ఎక్కడో తెలియని ప్రదేశంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు త్వరలో ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. నాగ చైతన్య గతంలో సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి వివాహమైన నాలుగు సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్‌లో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇది యావత్ సినీ పరిశ్రమకు, ఇరువురి అభిమానులకు షాకిచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య శోభితతో కనిపించడం మొదలుపెట్టాడు.కొత్తగా కట్టిన ఇంటికి నాగ చైతన్య చాలాసార్లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శోభితను నాగ చైతన్య పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ లండన్‌లో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. ఈ ఫోటోను చైతు కానీ, శోభితా కానీ షేర్ చేయలేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker