Health

Kidney: ఉన్దయం నిద్రలేవగానే మీ కళ్ళు ఇలా కనపడుతున్నాయా..? అయితే కిడ్నీలు డేంజర్‌లో ఉన్నాయని అర్థం.

Kidney: ఉన్దయం నిద్రలేవగానే మీ కళ్ళు ఇలా కనపడుతున్నాయా..? అయితే కిడ్నీలు డేంజర్‌లో ఉన్నాయని అర్థం.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఆహారం, నీరు రెండూ అవసరమే. ముఖ్యంగా మూత్రపిండాల పనితీరును మెరుగుపడటానికి తగినపాళ్లలో నీరు శరీరానికి అందడం ముఖ్యం. అయితే ఉదయం లేచిన వెంటనే కళ్ల చుట్టూ వాపు కనిపిస్తే అది సాధారణం కాదని గుర్తుంచుకోవాలి. ఇది మూత్రపిండాలు సరిగా పని చేయడం లేదన్న సంకేతంగా భావించాలి.

ముఖ్యంగా, మూత్రంలో ప్రొటీన్ లీక్ అవ్వడం వల్ల ఇలా జరగొచ్చు. కళ్ల చుట్టూ వాపుతో పాటు అలసట, చేతులు కాళ్లలో వాపు లాంటి సమస్యలు లేకపోయినా, కేవలం కళ్ల వాపే కూడా ఆరంభ లక్షణంగా భావించాలి. ఇంకా ఒక ప్రధాన లక్షణం మసక చూపు. ముఖ్యంగా మధుమేహం లేదా బీపీ ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వీటివల్ల కంటిలోని రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. ఇలా జరిగితే కంటి చూపు మందగించడం మొదలవుతుంది.

Also Read: ఇలాంటి బియ్యం విషంతో సమానం..!

చికిత్స లేకుండా నిర్లక్ష్యం చేస్తే చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. పొడి కళ్ల సమస్య కూడా కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు రావచ్చు. కళ్ళు పొడిబారడం, గుల్లుదనం, అసౌకర్యంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇది శరీరంలో వ్యర్థ పదార్థాలు తొలగించబడక పోవడం వల్ల వచ్చే లక్షణం. ముదిరిన దశలో కార్నియా సమస్యలకు దారితీస్తుంది. కళ్లలో ఎరుపు లేదా చిన్న నరాల్లో వాపు కనిపిస్తే అది కూడా ఊహించని మూత్రపిండ సంబంధిత సమస్యల సూచన కావచ్చు.

Also Read: గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు మనిషిలో కనిపించే లక్షణాలు ఇవే.

కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల కంటిలో చీలికలు, నొప్పి, వాపు వంటి సమస్యలు కలగవచ్చు. చివరిగా, ఆకస్మికంగా చూపు తగ్గిపోవడం లేదా చూపులో మార్పు రావడం ఎంతో ప్రమాదకరం. ఇది శరీరంలోని రక్తప్రసరణ తడబడినప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులలో దీని అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: ఈ బత్తాయి పండ్లు తిన్నాక, వీటిని అస్సలు తినకూడదు.

అలాంటి వేళ ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం అత్యవసరం. ఈ విధంగా కళ్లలో మార్పులు కనిపిస్తే వాటిని చిన్నవి అనుకుని విస్మరించకూడదు. ఇవి శరీరంలో లోపల జరుగుతున్న ముఖ్యమైన ఆరోగ్య సంకేతాలని గుర్తించాలి. త్వరగా స్పందిస్తే, కిడ్నీ సమస్యలు పెద్దదయ్యేలోపు నియంత్రించవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker