Health

6సెకన్లపాటు ముద్దు పెట్టుకుంటే ఆరోగ్యమే కాదు అంతకు మించి లాభాలున్నాయి.

ముద్దులో లాలాజల మార్పిడి ఉంటుంది. నోటిలోని బ్యాక్టీరియా చెడుగా ఉందో లేదో చెప్పడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. లాలాజలంలోని కొన్ని జీవులు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది దంత క్షయం, నోటి థ్రష్ లేదా స్ట్రెప్టోకోకస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే 6 సెకండ్ కిస్ థియరీ ఏంటి అని ఆలోచిస్తున్నారా అని అడగండి… ఈ థియరీ రిలేషన్ షిప్ లో ప్రేమను పెంచడమే కాకుండా ఇద్దరి మధ్య బంధాన్ని కూడా పెంచుతుంది. అయితే ఒక ముద్దు వల్ల మన ముఖంలోని 34 కండరాలతోపాటు 112 పోస్ట్రల్ కండరాలు ఉత్తేజితం అవుతాయట.

అలాగే ముద్దు పెట్టుకునేవారిలో 10 నుంచి 15 కేలరీల శక్తి బర్న్ అవుతుంది. శరీర మెటబాలిక్ రేట్ పెరిగి బరువు తగ్గుతుందట. ఒక ముద్దు స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. శృంగారానికి ప్రేరేపిస్తుంది. అంతే కాదు గుండె పనితీరును మెరుగుపరిచేందుకు, గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దు పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా పెదవి ముద్దు వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయట. ఇక ఒక్క ముద్దు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..ఒత్తిడి, ఆందోళన, ఆత్రుత నుంచి దూరం చేస్తుంది.

అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుందట. ఒక్క ముద్దు వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ రసాయనాల వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఎపినెఫ్రిన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగుపడుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మెడ, దవడ కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. ముద్దు పెట్టుకునే సమయంలో ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) వల్ల దంత క్షయం దూరమవుతుందట. ఇక ముద్దు పెట్టుకునే సమయంలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి.

ఈ రసాయనం నొప్పులను నియంత్రిస్తుంది. అలాగే తలనొప్పిని సైతం తగ్గిస్తుందట. ముద్దుపెట్టుకోవడం వల్ల ఒకరి శరీరంనుంచి మరొకరి శరీరంలోకి బాక్టీరియా బదిలీ కావడం వల్ల ఇద్దరిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఒక ముద్దులో లభిస్తాయట. ముద్దు సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్‌లు మిమ్మల్ని సంతోషం ఉంచేందుకు దోహదం చేస్తాయి. ఇలా ముద్దు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker