News

కుర్చీ తాత అరెస్ట్ కు ఆ స్టార్ హీరోనే కారణమా..? అసలు విషయమేంటంటే..?

అదే ఆ కుర్చీని మడత బెట్టి. ఈ సాంగ్ థియేటర్లలో విడుదల కాకుండానే నెట్టింట్లోనే ట్రెండ్ అయిన సంగతి విదితమే. ఓ తాత డైలాగ్ ఆధారంగా ఆ పాటను క్రియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన మాటలతో సోషల్ మీడియా సెన్సేషన్ అయిన కుర్చీతాత వాడిన పదం నుండి.. తీసుకుని ఈ ఆ పాటను క్రియేట్ చేశారు. ఆ పదం వాడుకున్నందుకు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు.

అయితే రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ తాత డైలాగుతో ఒక పాటనే వచ్చిందంటే ఆయన క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో ఈ సాంగ్ రావడంతో కుర్చీ తాత రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ కాలా పాషాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే కుర్చీ తాత నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే బూతు మాటతోనే గుంటూరు కారం సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ను సిద్దం చేశారు.

ఈ సాంగ్ కు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. దీని కోసం వైజాగ్ సత్య అనే వ్యక్తి కుర్చీ తాతను తమన్ వద్దకు తీసుకెళ్లారట. ఈయన ఇచ్చిన ఫిర్యాదు వల్లనే కుర్చీతాతను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో వైజాగ్ సత్య అనే వ్యక్తి ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీగా చలామణి అవుతున్నారు. ఈయనే స్వయంగా కుర్చీ తాతను తమన్ వద్దకు తీసుకెళ్లారట.

ఇదిలా ఉంటే తమన్ వద్ద డబ్బులు తీసుకొని తాను కాజేసినట్టు.. కుర్చీ తాత ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ముందు వీరిద్దరు బాగానే ఉండేవారట. కానీ మహేష్ బాబును అడిగి ఇల్లు ఇప్పించమని కోరడంతో తన వల్ల కాదన్నారట వైజాగ్ సత్య. దీంతో ఎదురు తిరిగి ఇలా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు సత్య. ఈయన ఫిర్యాదు మేరకు కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker