News

క్లాసులో డ్యాన్స్ ఇరగదీసిన లేడీ టీచర్, వైరల్ అవుతున్న వీడియో.

ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే తమకు నచ్చిన పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఇలా చేసిన ఆ రీల్స్ ను వీడియోలను సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టాగ్రామ్, మోజో, ఫేస్ బుక్ వంటి వాటిల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ లేడీ టీచర్‌ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది. శివపురి జిల్లాలోని కరైరా లో సీసీఎల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

అక్కడకి వచ్చిన ఉపాధ్యాయురాలు ..ట్రైనింగ్ సెషన్ ముగియగానే అక్కడున్న టీచర్స్‌తో కాసేపు ఆనందంగా గడిపేందుకు హిందీ సినిమాలోని ఓ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తరగతి గదిలో ఓ లేడీ టీచర్ డ్యాన్స్ చేస్తుంటే మిగిలిన వాళ్లంతా ఆసక్తిగా చూస్తుండిపోయారు. టీచర్ డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో ప్రిన్సిపల్‌ వచ్చి ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయిపోయి..

ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైనింగ్ క్లాస్‌కి వచ్చిన ఉపాధ్యాయులంతే కాస్త ఆనందంగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్..విద్యార్ధులకు పాఠాలు చెప్పడం, క్రమశిక్షణ నేర్పించడం టీచర్స్ బాధ్యత. వృత్తిలో భాగంగానే ఎప్పుడూ తరగతి గదిలో రూలర్స్‌గా వ్యవహరించే టీచర్స్ మధ్యప్రదేశ్‌లో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా డ్యాన్స్‌ చేసి వార్తల్లోకి ఎక్కారు.

మధ్యప్రదేశ్ శివపురిలోని కరైరా బ్లాక్‌లో ఉపాధ్యాయుల శిక్షణ నిర్వహించబడింది. సీసీఎల్ శిక్షణ సందర్భంగా అక్కడకు వచ్చిన ఓ మహిళ టీచర్ దిల్ బెహల్తా హై మేరా ఆప్ కే ఆ జానే సే’ పాటకు డ్యాన్స్ చేసింది. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా టీచర్ అద్బుతంగా నృత్యం చేస్తుంటే ట్రైనింగ్ క్లాస్‌లకు వచ్చిన మిగిలిన టీచర్స్ ఆమె డ్యాన్స్ చూస్తూ ఉండిపోయారు. అయితే ప్రిన్సిపాల్ మాత్రం లేడీ టీచర్ డ్యాన్స్ సమయంలో ప్రిన్సిపాల్ టీచర్‌కి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు.

ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే రెగ్యులర్‌గా పాఠాలు చెబుతూ సీరియస్‌గా ఉంటే టీచర్లు..ఈవిధంగా ట్రైనింగ్ సెషన్‌కి వచ్చిన సందడి చేయడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. అయితే ఎవరో లేడీ టీచర్ డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇక కామెంట్స్ అయితే ఎవరికి తోచినట్లుగా వారు షేర్ చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker