News

రూ.2,000 నోట్లు ఉన్నాయా..? మీరు వెంటనే చెయ్యాల్సిన పనులు ఇవే.

కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ, పంపిణీ ఉండదని.. మార్కెట్‌లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ స్పష్టం చేసింది. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. అయితే రూ.2,000 నోట్లు సర్క్యులేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే రూ.2000 నోట్లు లీగల్ టెండర్‌గా ఉంటాయని ఆర్‌బీఐప్రకటించింది. సర్క్యులేషన్ నిలిపివేస్తున్నామని అంటున్నారు. లీగల్ టెండర్‌గా ఉంటుందని అంటున్నారు. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది.

తమ దగ్గర రూ.2,000 నోట్లు ఉంటే ఏంచేయాలి? రూ.లక్ష విలువైన రూ.2000 నోట్లు ఉంటే మీరు దాన్ని బ్యాంకులో వేసుకోవచ్చా? ఓ కోటి రూపాయలు రూ.2000 నోట్లు ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటి? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానాలు తెలుసుకోండి. మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉంటే వాటిని బ్యాంకులోనే మార్చుకోవాలని ఏం లేదు. 2023 సెప్టెంబర్ 30 వరకు మీరు ఎక్కడైనా ఈ నోట్లను ఉపయోగించవచ్చు. షాపింగ్ చేసినప్పుడు రూ.2,000 నోట్లతో బిల్లు చెల్లించవచ్చు. ఎందుకంటే లీగల్ టెండర్‌గా ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది కాబట్టి, వాటిని తీసుకోమని ఎవరూ అనడానికి లేదు. బంగారం నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు ఏమైనా కొనొచ్చు.

అయితే వాటిని లావాదేవీల కోసం ఉపయోగించడం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా ఎక్స్‌ఛేంజ్ చేయడాన్ని ఆర్‌బీఐ ప్రోత్సహిస్తోంది. కాబట్టి మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉన్నట్టైతే బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. లేదా డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులో డిపా‌జిట్‌కు లిమిట్ ఉందా.. మే 23 నుంచి మీ దగ్గర ఎన్ని రూ.2,000 నోట్లు ఉన్నా వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌లో రూ.2,000 నోట్లు డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులో డిపాజిట్ చేయడానికి లిమిట్ ఏమీ లేదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీ అకౌంట్‌లో డిపాజిట్ చేయొచ్చు.

అయితే కేవైసీ పూర్తి చేసిన అకౌంట్లలోనే ఎలాంటి పరిమితులు లేకుండా రూ.2,000 నోట్లు డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులో ఎన్ని నోట్లైనా ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చా.. బ్యాంకులో రూ.2,000 నోట్లు డిపాజిట్ చేయడంతో పాటు, ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అంటే మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉంటే బ్యాంకులో ఇచ్చి రూ.500, రూ.200 లేదా ఇతర డినామినేషన్స్ ఉన్న నోట్స్ తీసుకోవచ్చు. బ్యాంకులతో పాటు ఆర్‌బీఐకి చెందిన 19 రీజనల్ ఆఫీసుల్లో కూడా వీటిని ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. ఒక్కసారి కేవలం రూ.20,000 నోట్లు మాత్రమే ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇక బ్యాంకులకు, ప్రజలకు వారధులుగా ఉంటే బిజినెస్ కరస్పాండెంట్స్ ప్రతీ రోజు ఒక అకౌంట్ హోల్డర్‌కు రూ.4,000 వరకు ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. రూ.20,000 కన్నా ఎక్కువ క్యాష్ కావాలంటే ఏం చేయాలి.. మీ దగ్గర రూ.20,000 కన్నా ఎక్కువ రూ.2,000 నోట్లు ఉంటే, వాటిని అత్యవసరంగా ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే మీ దగ్గర ఒకే ఆప్షన్ ఉంది. మీరు మీ దగ్గరున్న రూ.2,000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలి. రూ.2,000 విలువైన నోట్లు కోటి రూపాయలు ఉన్నా వాటిని డిపాజిట్ చేసి నిబంధనల ప్రకారం డ్రా చేసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker