కాలి బొటనవేలు కంటే రెండో వేలు పొడవుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా..?
ఇప్పుడు మన శరీర భాగాల ప్రశ్నకు వస్తే వేళ్లు చాలా ముఖ్యమైనవి. వేళ్లు, కాలి వేళ్లు మనకు చాలా విషయాలు చెబుతాయి. వాటి ఆకారం, పొడవు ,వెడల్పు అన్నీ రహస్యాన్ని వెల్లడిస్తాయి. కొందరికి బొటనవేలు కంటే పక్క బొటనవేలు పొడవుగా ఉండడం కూడా మీరు గమనించి ఉండవచ్చు. దీని వెనుక ఒక రహస్యం కూడా ఉంది. అయితే సాధారణంగా పెళ్లిచూపులు అనగానే అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని గమనిస్తూ ఉంటారు.. ఎవరు ఏవిధంగా ఉన్నారు. ఎటువంటి పోలికలున్నాయి.. అనేవి చూస్తారు.
కానీ పూర్వకాలంలో పెద్దలు మాత్రం ఎక్కువగా ఎలాంటి పోలికలు ఉన్నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో సూచించారు. ప్రస్తుత సమాజంలో కొందరు మంచి నడవడిక, లక్షణాలను బట్టి క్యారెక్టర్ చెబుతారు. ఈ విధంగానే అమ్మాయి కాలి వేళ్లను బట్టి కూడా వారు వివాహం తర్వాత ఏ విధంగా నడుచుకుంటారో, ఎలా ప్రవర్తిస్తారో వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అనే విషయాలను చెబుతూ ఉంటారు.
అమ్మాయి కాలి బొటనవేలు కంటే దాని పక్కన వేలు పొడవుగా ఉన్నట్లయితే వారు చాలా తెలివైన వారిగా ఉంటారట. వారికి క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుందని అంటారు. అలాగే మిగతా వేళ్ళకంటే బొటనవేలు పొట్టిగా ఉన్న అమ్మాయి అయితే ఎన్ని పనులైనా సునాయసంగా చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా బొటనవేలు పక్కన వేలు మిగతా అన్ని వేళ్ల కంటే పొడవుగా ఉంటే మాత్రం ఆ అమ్మాయికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయట.
ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తారట. అదే కాలి రెండో వేలు అన్ని వేళ్ళకంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు అందరితో కలిసి పోతారట.. అదే కాలి మొదటి మూడు వేళ్లు సమానంగా ఉండి, చివరి రెండు వేలు చిన్నగా ఉన్న అమ్మాయిలు చాలా దృఢంగా ఉంటారట, అలాగే అన్ని వేళ్ళు పొడవుగా ఉండి నాలుగో వేలు పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఫ్యామిలీ లో బంధుత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపరని నిపుణులు అంటున్నారు.