News

అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్‌ ఎలాంటిదో బయటపెట్టిన మేకప్‌మెన్. ఈ రోజుల్లో కూడా..!

ఆమె టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు కథానాయికల దశ దిశని మార్చేసింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో స్టార్‌ హీరోల రేంజ్‌లో మెప్పించింది. అరుంథతితో ఆమె సంచలనం సృష్టించింది. పంచాక్షరి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పించింది. బాహుబలిలోనూ ప్రభాస్‌కి దీటుగా చేసింది.

సినిమాలో ఆమె గ్లామర్‌గానేకాదు, అంతకు మించిన యాక్షన్‌తోనూ మెప్పించింది. అద్భుతమైన నటనతో అదరగొట్టింది. అయితే ఇటీవల ఆమె సినిమాలు తగ్గించింది. అధిక బరువు కారణంగా ఆమె బయటకు రాలేకపోతుంది. అదే సమయంలో సినిమాలు కూడా చాలా సెలక్టీవ్‌గా చేస్తుంది. ఇటీవల మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టిలో నటించింది కానీ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.

బరువు సమస్య కారణంగానే ఆమె బయటకు రాలేకపోతుందని తెలుస్తుంది. తాజాగా అనుష్క మేకప్ మేన్ రామచంద్రరావు ఆమె గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకి తెలిసిన వారికి సమస్య వస్తే తనకే వచ్చినట్లు బాధ పడుతుందని. ఆమె దయాగుణం గురించి చెప్పారు.

ఏ హీరోయిన్లు లో అలాంటి క్వాలిటీస్ ఉండవని అనుష్క లో మాత్రం మంచితనం ఉందని అన్నారు. అలానే డబ్బులు విషయంలో నిర్మాతల్ని అస్సలు అనుష్క ఇబ్బంది పెట్టదని అన్నారు. ఇలాంటి గొప్ప అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదని ఆయన చెప్పారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker