News

శ్రీదేవి తో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ అని మీకు తెలుసా..? అందరు చిరంజీవితో నటించినవాళ్లే..!

తాజాగా అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి ముగ్గురు చిన్నారులు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున దీనిని షేర్ చేస్తూ ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు చిన్నారులు ఎవరో గుర్తుపట్టండి… వీరు కూడా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగారు.. వీరెవరో గుర్తు పట్టాలంటే ఒక చిన్న క్లూ.. ఈ ముగ్గురు హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించారు. మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో గుర్తుపట్టారా..ఇప్పటికీ వీరెవరో గుర్తించలేకపోతున్నారా అయితే ఇది ముగ్గురు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించారు.

వారే నగ్మా, జ్యోతిక, రోషిని. ఈ ముగ్గురు అక్క చెల్లెలు అయినప్పటికీ ముగ్గురు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. జ్యోతిక:-దక్షిణ సినీ ఇండస్ట్రీలో తెలుగు , తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో సూర్య ను వివాహం చేసుకుంది. మొదటిసారి షాక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన జ్యోతిక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది .

సూర్య నటించిన చాలా సినిమాలకు ఈమె నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే.. మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ చాలా బిజీగా ఉంది జ్యోతిక. రోషిణి:-ఈమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో చిరంజీవి సరసన మాస్టారు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరమై.. అమెరికాలో ఒక వ్యాపార వేత్త ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయినట్లు సమాచారం.

నగ్మ:-ఇక స్టార్ హీరోయిన్ నగ్మా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈమె అప్పట్లో కుర్రకారుకు కలల రాకుమారిగా మిగిలిపోయింది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ ki ఎదిగిన నగ్మా వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ ..చివరికి ఏ ఒక్కరిని కూడా వివాహం చేసుకోకుండా ఐదు పదుల వయసులో కూడా వివాహానికి దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker