Health

లిప్‌స్టిక్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు.

అధరాలకు అందాన్నిచ్చే లిప్‌స్టిక్‌ను పెదాలకు అద్దుకుని మురిపిపోతుంటారు మగువలు. ఐతే ఒక్కోసారి లిప్‌స్టిక్‌ వాడటం వల్ల పెదాలపై చర్మం పొడిబారి అందవిహీనంగా మారిపోతుంటాయి. పెదాలపై పగుళ్లు ఏర్పడి రక్తం కారుతుంటుంది. ఇలాంటివి నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తరచూ లిప్‌స్టిక్‌ వాడేవారు రోజూ తప్పనిసరిగా కాస్త వెన్న పెదాలకు రుసుకోవాలి. లేదంటే పెట్రోలియం జెల్లీ అయినా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.

తేనె, పంచదార మిశ్రమంతో పెదాలపై మృదువుగా రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత లిప్‌స్టిక్‌ వేస్తే ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తాయి. అలాగే పగిలిన పెదాలకు కొద్దిగా ఆవనూనె తీసుకొని అప్లై చేస్తే పెదవులు కొంత సమయం పాటు మంట పెడతాయి. ఆ తర్వాత పెదాలు తేమ సంతరించుకుని మృదువుగా తయారవుతాయి. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదాలకు కొద్దిగా తేనె రాసుకుని మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేస్తే పొడిబారి నల్లగా మారిన పెదవులు తిరిగి తేమను సంతరించుకుంటాయి.

అయితే చాలా మంది అమ్మాయిలు లిప్‌స్టిక్‌ను తమకు తెలియకుండానే మింగేస్తున్నారు. లిప్‌స్టిక్‌ను పెదవులపై రుద్దినప్పుడల్లా.. అది కడుపులోకి పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా దాని ప్రభావం జీర్ణకోశ వ్యవస్థపై చూపుతోంది. లిప్‌స్టిక్‌ మింగిన వారికి ఇరిటేబుల్‌ వంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.

లిప్‌స్టిక్‌ను వాడే మోతాదు, సంఖ్యను బట్టి అనారోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. లిప్‌స్టిక్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని రకాల లిప్‌స్టిక్‌ల్లో 10 పీపీఎం సీసం ఉంటోంది. ఇంతస్థాయిలో సీసం ఉంటే ప్రమాదకరం. అదే విధంగా లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడడం వల్ల నరాలకు సంబంధించిన జబ్బులు, మూత్రపిండాలు, ఎముకలు, కేన్సర్‌వంటి వ్యాధులొచ్చే అవకాశముంది.

మరి కొందరికి గైనిక్‌ సమస్యలూ వస్తాయి. అలాగే ముఖ్యంగా గర్భిణులూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లిప్ట్సిక్‌, మేక‌ప్ ప్రోడెక్ట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట. ఇంకా వాళ్ళు ఎదుగుతున్న ఏజ్ లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు లిప్ట్సిక్‌కు దూరం ఉండ‌డం చాలా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker